జాతీయ వార్తలు

అద్భుతం.. అనిర్వచనీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులకు సోమవారం సబర్మతి ఆశ్రమంలో అపూర్వ స్వాగతం లభించింది. ప్రజల ఆదరాభిమానాలు చూసిన ట్రంప్, ఆయన సతీమణి మెలానియా ఉబ్బితబ్బిబ్బయారు. 1917-1930 మధ్య కాలంలో సబర్మతి ఆశ్రమం నుంచే మహాత్మాగాంధీ స్వాతంత్య్ర ఉద్యమాన్ని నడిపారు. ఆశ్రమానికి విచ్చేసిన శే్వతసౌథం అధినేత ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. ‘మోదీ మాకు గొప్ప స్నేహితుడు’అని ట్రంప్ ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ వెంటరాగా అధ్యక్షుడు ట్రంప్, అమెరికా ప్రథమ మహిళ మెలానియా సబర్మతి ఆశ్రమంలో కాసేపుగడిపారు. గాంధీ, ఆయన సతీమణి కస్తూర్బా గడిపిన ఆశ్రమంలోని ‘హృదయ్ కుంజ్’ను ట్రంప్, మెలానియా చూశారు. స్వాతంత్య్ర సమర కాలంలో సబర్మతి ఆశ్రమం పోషించిన పాత్రను మోదీ వారికి వివరించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా స్వయంగా చరఖా తిప్పారు. చరఖాపై ట్రంప్ నూలు వడుకుతుండగా ఆయన సతీమణి మెలానియా సహకరించారు. సబర్మతి ఆశ్రమానికి వచ్చిన ట్రంప్ అక్కడి సందర్శకుల పుస్తకంలో ఇలా రాశారు..‘ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాకు గొప్ప స్నేహితుడు. మాకు లభించిన స్వాగతం అద్భుతం’ అని అన్నారు. విజటర్స్ పుస్తకంలో ట్రంప్ తన సందేశం రాశారు. ట్రంప్ సతీమణి మెలానియా కూడా పుస్తకంలో సంతకం చేశారు. దంపతులిద్దరరూ 15 నిమిషాలు సబర్మతి ఆశ్రమంలో గడిపారు. ఆశ్రమంలోని ‘మూడు కోతుల’ బొమ్మలను చూసి అబ్బురపడ్డారు. చెడు వినవద్దు, చెడు కన వద్దు, చెడు అన వద్దు’ అన్న గాంధీజీ సూక్తికి స్ఫూరణగా మూడు కోతులు బొమ్మలు ఏర్పాటు చేశారు. ఈ మూడు తెలివైన కోతులు అంటూ అమెరికా అధ్యక్షుడికి మోదీ వివరించారు. ఆ సందర్భంగా ట్రంప్‌కు ఆయనో మెమెంటో అందజేశారు. తరువాత దేశాధినేతలు ఇద్దరూ మోటేరా క్రికెట్ స్టేడియంకు రోడ్ షో నిర్వహించారు. ట్రంప్, మెలానియా దంపతులకు సబర్మతి ఆశ్రమం ట్రస్టీ కార్తికేయ సరాభీ స్వాగతం పలికారు. ఆశ్రమంలోని గడిపిన క్షణాలను తనకు మధురానుభూతిని కల్పించాయని ట్రంప్ ఆనందం వ్యక్తం చేశారు. సబర్మతి ఆశ్రయం గొప్పతనాన్ని కార్తికేయ అగ్రరాజ్యాధినేతకు తెలిపారు. గాంధీజీ ఆటోబయోగ్రఫీ, గాంధీజీ వాడిన పెన్సిల్, చరఖా జ్ఞాపికలను ట్రంప్‌కు బహూకరించారు.
*చిత్రాలు.. సబర్మతీ ఆశ్రమంలో ట్రంప్‌కు ‘మూడు తెలివైన కోతులు’ బొమ్మలను బహూకరిస్తున్న మోదీ. పక్కన అమెరికా ప్రథమ మహిళ మెలానియా
*సబర్మతీ ఆశ్రమంలో చరఖా తిప్పుతున్న ట్రంప్