జాతీయ వార్తలు

అట్టుడికిన ఢిల్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల ఘర్షణతో దేశ రాజధాని ఢిల్లీ అట్టుడికి పోయింది. ఇరువర్గాల మధ్య సోమవారం జరిగిన ఘర్షణల్లో ఓ హెడ్ కానిస్టేబుల్ మృతి చెందాడు. డిప్యూటీ పోలీసు కమిషనర్‌గాయపడ్డారు. ఈశాన్య ఢిల్లీలోని జఫార్‌బాద్, వౌజ్‌పూరలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. నిరసనకారులు ఇళ్లకు, దుకాణాలకు, వాహనాలకు నిప్పుపెట్టారు. పరస్పరం ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాలు చాంద్‌బాగ్, భాజాన్‌పూరా ప్రాంతాల్లోనూ పరస్పరం ఘర్షణకు దిగినట్టు వార్తలందాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటనకు వస్తారనగా ఈ ఘర్షణలు చోటుచేసుకోవడం గమనార్హం. ఆదివారం కూడా రెండు వర్గాలు గొడవపడిన సంగతి తెలసిందే. నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు భాష్పవాయువుప్రయోగించారు. లాఠీ చార్జీ చేశారు. ఘర్షణలు తీవ్రరూపం దాల్చాయి. నిరసనకారులు రతన్ లాల్ అనే హెడ్ కానిస్టేబుల్‌పై దాడి చేయగా, అతడు చనిపోయాడు. గోకల్‌పూరి ఏసీపీ ఆఫీసుపై ఆందోళనకారులు దాడి చేశారు. ఈ దాడిలోనే రతన్ లాల్ మృతి చెందాడు. నిరసనకారులను అదుపుచేయడానికి ప్రయత్నించిన డిప్యూటీ పోలీస్ కమిషనర్ షాదరా, అమిత్ శర్మ, పలువురు పోలీసులు గాయపడ్డారు. ఈశాన్య ఢిల్లీలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో 144వ సెక్షన్ విధించారు. ఎక్కడా నలుగురు వ్యక్తులు గుమికూడకుండా ఆంక్షలు అమలు చేస్తున్నారు. వౌజ్‌పూర, భాజాన్‌పూరలో విచ్చల విడిగా హింస్మాతక ఘటనలు చోటుచేసుకున్నాయి. షాపులు, ఇళ్లు, వాహనాలకు నిప్పుపెట్టారు. ఓ దుండగుడు ఏకంగా తెగించి అక్కడున్న పోలీసు నుంచి తుపాకీ లాక్కున్నాడు. తుపాకీతో పలు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపాడు. ఈ సందర్భంగా పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారిందని అధికారులు వెల్లడించారు. పరిస్థితి అదుపుతప్పుతుందని భావించి కాల్పులకు ఆదేశాలిచ్చినట్టు పోలీసు అధికారులు తెలిపారు. దేశ రాజధానిలో శాంతి భద్రతల అదుపునకు కేంద్రం చర్యలు తీసుకోవాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కోరారు. తక్షణం రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దాలని ఢిల్లీ పోలీసు కమిషనర్ అమూల్య పట్నాయక్‌ను లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ఆదేశించారు. ‘ శాంతికి విఘాతం, హింస్మాతక ఘటనల వార్తలు ఎంతో ఆందోళన కలిగించాయి.
తక్షణం జోక్యం చేసుకోవాలని కేంద్ర హోం మంత్రి, లెఫ్టినెంట్ గవర్నర్‌ను కోరుతున్నా. ఘర్షణలకు ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి’అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఢిల్లీ పోలీసు కమిషనకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు లెఫ్టినెంట్ గవర్నర్ తన ట్విట్టర్‌లో వెల్లడించారు. పరిస్థితులు చక్కదిద్దాలని, ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చూడాలని రాష్టమ్రంత్రి, బాబర్‌పూర్ ఎమ్మెల్యే గోపాల్ రాయ్ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఇలా ఉండగా సీఏఏకు వ్యతిరేకంగా శనివారం రాత్రి పలువురు మహిళలు జఫార్‌బాద్ మెట్రో స్టేషన్ వెలుపల రోడ్డును దిగ్బంధం చేశారు.
ఆందోళనలు మిగతా ప్రాంతాలకు పాకాయి. ఆదివారం సాయంత్రం సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో, హౌజ్‌రాణిలో రహదారులపై బైఠాయించారు. బీజేపీ నాయకుడు అపిల్ మిశ్రా ఆదివారం ఓ సభలో చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోశాయి. సీఏఏను వ్యతిరేకిస్తున్న వారిని అదుపుచేయాలని, మూడు రోజుల్లో వారిని అక్కడ నుంచి తొలగించాలన్న డిమాండ్ చేశారు. మిశ్రా వ్యాఖ్యలతో ఈశాన్య ఢిల్లీ అంటుకుంది. ఎక్కడికక్కడ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. కాగా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా జాఫరాబాద్, వౌజ్‌పుర-బాబర్‌పుర మెట్రో స్టేషన్‌లను మూసివేశారు. మెట్రో రైళ్లను ఆ స్టేషన్లలో నిలపడం ఆపేశారు. ఈ విషయాన్ని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ట్వీట్ చేసింది. మూడు మెట్రో స్టేషన్‌లలో రాకపోకలు నిషేధించినట్టు వెల్లడించారు.