జాతీయ వార్తలు

ఈ బంధం విడదీయలేనిది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆగ్రా: ప్రేమకు చిహ్నం.. ప్రపంచంలోనే అద్భుత కట్టడాల్లో ఒకటైన తాజ్‌మహల్.. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడి సందర్శనకు వేదికైంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత్‌కు సోమవారం విచ్చేసిన ట్రంప్, ఆయన భార్య, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌తో కలిసి ఆగ్రాలోని చారిత్రక కట్టడమైన తాజ్‌మహల్ అందాలను తిలకించి మంత్ర ముగ్ధులయ్యారు. ట్రంప్‌తోపాటు ఆయన కుమార్తె ఇవాంకా, ఆమె భర్త జరేద్ కుష్నర్ సైతం తాజ్‌మహల్ పరిసర ప్రాంతాల్లో కలియతిరిగారు. అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమం సందర్శన, ప్రపంచంలోనే అతిపెద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ క్రికెట్ స్టేడియంలో నిర్వహించిన ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో జాతినుద్దేశించి ప్రసంగించిన అనంతరం అమెరికా అధ్యక్షుడు ఆగ్రాకు విచ్చేశారు. మొగల్ సామ్రాజ్యాధినేత షాజహాన్ తన భార్య ముంతాజ్ 1631లో మరణించిన తరువాత ఆమెపై ఉన్న ప్రేమకు చిహ్నంగా తాజ్‌మహల్‌ను పాలరాతి కట్టడంగా మలిచిన సంగతి తెలిసిందే. 2000 సంవత్సరంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ తన కుమార్తె చెలిసా క్లింటన్‌తో తాజ్‌మహల్‌ను సందర్శించి పరవశమయ్యారు. ఆ తరువాత తాజ్‌మహల్‌ను ప్రస్తుతం తాజ్‌మహల్‌ను ట్రంప్ తన భారత పర్యటనలో భాగంగా సందర్శించారు. ఈ సందర్భంగా విజిటర్ల పుస్తకంలో ట్రంప్ దంపతులు అద్భుత కట్టడమైన తాజ్‌మహల్ గురించి తమ సందేశాన్ని సవివరంగా పేర్కొని సంతకాలు చేశారు. ఆగ్రా నగరానికి ట్రంప్ దంపతులు తరలిరావడంతో స్థానికుల ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. అనేక వ్యాపార సముదాయాల వద్ద ట్రంప్‌కు స్వాగతం పలుకుతూ బ్యానర్లను ప్రదర్శించారు. ఆగ్రా విమానాశ్రయం నుంచి తాజ్‌మహల్ వరకు ట్రంప్ కాన్వాయ్‌కు ఇరువైపులా వేలాది మంది విద్యార్థులు ఇరు దేశాల మధ్య స్నేహ బంధం మరింత బలపడాలని గుర్తు చేస్తూ భారత్-అమెరికా దేశాల జెండాలను చేతబూని అమెరికా అధ్యక్షుడికి అత్యంత ఉత్సాహంతో స్వాగతం పలికారు. తాజ్‌మహల్ అందాలను ఆస్వాదిస్తూ ట్రంప్ భారత్‌తో స్నేహబంధాన్ని ప్రస్తావించారు. ‘్భరతదేశంలోని ప్రతి పౌరుడికి ఒక సందేశాన్ని అందజేయాలన్న కోరికతో ఎనిమిది వేల మైళ్ల దూరాన్ని ప్రయాణించి ఇక్కడికి చేరుకొన్నా.. భారత్‌ను అమెరికా ఎంతగానో ప్రేమిస్తోంది.. గౌరవిస్తోంది.. అమెరికన్‌లు సైతం ఒక చిత్తశుద్ధిగల మిత్రులుగా భారత్ పౌరులను చూస్తారు’ అంటూ హిందీలో ట్రంప్ ప్రస్తావించారు.
*చిత్రం... పాలరాతి సౌధం తాజ్‌మహల్ ముందు డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య మెలానియా