జాతీయ వార్తలు

5న జీఎస్‌ఎల్‌వీ ఎఫ్-10 ప్రయోగం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, ఫిబ్రవరి 25 : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో భారీ ప్రయోగానికి సిద్ధమవుతోంది. పీఎస్‌ఎల్‌వీ రాకెట్ ప్రయోగాలలో ఎదురులేని శక్తిగా ఎదిగిన ఇస్రో అదే స్ఫూర్తితో ఇప్పుడు జీఎస్‌ఎల్‌వీ సిరీస్‌పై దృష్టి పెట్టింది. బరువైన ఉపగ్రహాన్ని రోదసిలోకి మోసుకెళ్లే సామర్ధ్యం కలిగిన జీఎస్‌ఎల్‌వీ అంతరిక్ష వాహన నౌకలలో స్వీయ పరిజ్ఞానాన్ని సాధించిన ఇస్రో ఇప్పుడు ఆ ప్రయోగాల పరంపరపై గురిపెట్టింది. విశ్వ వినువీధుల్లో సుదూర లక్ష్యాన్ని చేరుకోగలిగిన జీఎస్‌ఎల్‌వీ వాహక నౌక ద్వారా చంద్రయాన్‌కు సిద్ధమవుతున్న ఇస్రో మార్చి 5న జీఎస్‌ఎల్‌వీ ఎఫ్-10 ప్రయోగం చేపట్టేందుకు సన్నద్ధమవుతోంది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి మార్చి 5న జీఎస్‌ఎల్‌వీ ఎఫ్-10 వాహక నౌకను నింగిలోకి పంపేందుకు షార్ శాస్తవ్రేత్తలు సన్నా హాలు చేస్తున్నారు. ఇప్పటికే జీఎస్‌ఎల్‌వి వాహక నౌక అనుసంధానం పూర్తి కావచ్చింది. ఉపగ్రహాన్ని అనుసంధానం చేయాల్సి ఉంది. దీని ద్వారా 2300 కిలోల బరువుగల జీ శాట్-1 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే ఇంధనం నింపే పనుల్లో శాస్తవ్రేత్తలు నిమగ్నం అయ్యారు. తాజాగా ఇస్రో చేపట్టనున్న జీఎస్‌ఎల్‌వీ ఎఫ్-10 ప్రయోగం వల్ల మరోప్రయోగం వాయిదా పడే పరిస్థితి నెలకొంది. షార్ నుంచి వచ్చే నెల 18న ప్రయోగించ తలపెట్టిన పీఎస్‌ఎల్‌వీ సి-49 ప్రయోగం వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు శాస్తవ్రేత్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పీఎస్‌ఎల్‌వీ సి-49ద్వారా రీశాట్ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపాల్సి ఉంది. ప్రస్తుతం జీఎస్‌ఎల్‌వీ ప్రయోగం కారణంగా పీఎస్‌ఎల్‌వీ సి-49 ప్రయోగం ఏప్రిల్ మొదటి వారానికి వాయిదా వేయాలని శాస్తవ్రేత్తలు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

*చిత్రం... ప్రయోగానికి సిద్ధమవుతున్న జీఎస్‌ఎల్‌వీ ఎఫ్-10