జాతీయ వార్తలు

సమస్యాత్మక ప్రాంతాల్లో ధోవల్ పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్న సమస్యాత్మక ప్రాంతాల్లో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ బుధవారం సందర్శించి, పరిస్థితిని సమీక్షించారు. అక్కడి స్థానికులతో ఆయన మాట్లాడారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలుసుకొని, వివరాలను ఆయనకు అందజేశారు. పరిస్థితి ప్రస్తుతం అదుపులోనే ఉందని, సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని విలేఖరులతో మాట్లాడుతూ ఆయన అన్నారు. పోలీసు వ్యవస్థపైన, చట్టబద్ధమైన సంస్థలపైన తనకు ఎంతో నమ్మకం ఉందని ధోవల్ అన్నారు. జాఫ్రాబాద్‌లో ఆయన పోలీసు అధికారుల కాన్వాయ్‌తో కలసి నడవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అక్కడ ఒక విద్యార్థిని ధోవల్‌తో మాట్లాడుతూ తాను ఆందోళన చేయడం లేదని, అయితే చదువుకునే పరిస్థితి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై ధోవల్ స్పందిస్తూ పరిస్థితి చక్కబడుతోందని, ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని అన్నారు. మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటాయన్న హామీ ఇస్తున్నట్టు ఆయన చెప్పారు. ఇలావుంటే, హోం మంత్రి అమిత్ షాను కలిసిన ఆయన ఈశాన్య ఢిల్లీలో నెలకొన్న పరిస్థితులపై సంక్షిప్త వివరణ ఇచ్చారు. సాధారణ పరిస్థితులు నెలకొనే దిశగా తీసుకుంటున్న చర్యలను కూడా వివరించారు. ధోవల్‌తోపాటు కేంద్ర హోం కార్యదర్శి అజయ్ భల్లా, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ అరవింద్ కుమార్, ఢిల్లీ పోలీస్ కమిషనర్ అమూల్య పాఠక్ కూడా అమిత్ షాను కలిశారు. శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని, తాజాగా చెప్పుకోదగ్గ సంఘటనలు ఏవీ జరగలేదని వీరు అమిత్ షాకు వివరించినట్టు సమాచారం.