జాతీయ వార్తలు

2024 నాటికి రక్షణ రంగ ఎగుమతుల లక్ష్యం 35వేల కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఫిబ్రవరి 27: ప్రస్తుత 17వేల కోట్ల రూపాయిలుగా ఉన్న రక్షణ రంగ ఎగుమతులు 2024 సంవత్సరం నాటికి 30వేల కోట్లకు చేరనున్నాయని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం స్పష్టం చేశారు. అలాగే, 2030 నాటికి ప్రపంచంలోనే అత్యధిక ఆర్థిక వ్యవస్థను కలిగిన మూడు దేశాల్లో ఒకటిగా భారత్ మారబోతోందని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. బెంగళూరు హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో జరిగిన కర్నాటక ‘రాజ్యోత్సవ’ కార్యక్రమంలో రాజ్‌నాథ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ‘్భరత రక్షణ రంగ ఎగుమతులు పెరుగుతున్నాయి.. గత రెండేళ్లలో ఏటా 17వేల కోట్ల మేర ఎగుమతులు జరిగాయి.. రానున్న సంవత్సరాల్లో ఎగుమతులు మరింతగా పెరగనున్నాయి. 2024 నాటికి ఇది 35వేల కోట్లకు చేరే అవకాశాలు ఉన్నాయి’ అని ఈ సందర్భంగా రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. ముందు ముందు రక్షణ దిగుమతులపై ఆధారపడకుండా ఉండడమే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘మేకిన్ ఇండియా’ ముఖ్య ఉద్దేశమనీ.. ముఖ్యంగా భారత్‌లోని రక్షణకు సంబంధించిన ప్రభుత్వ రంగ సంస్థలు ప్రధాన భూమిక పోషించనున్నాయని ఆయన పేర్కొన్నారు. ‘దిగుమతులు చేసుకొనే దేశంగా భారత్‌ను మేం చూడాలని అనుకోవడం లేదు.. కచ్చితంగా భారత్ ఎగుమతులు చేసే దేశంగా వర్ధిల్లుతుంది.. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు’ అని రాజ్‌నాథ్ ఈ సందర్భంగా ఆహూతులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో స్పష్టం చేశారు. ఇందులో హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కీలక పాత్ర పోషించాల్సి ఉందని పేర్కొన్నారు. కార్యకలాపాల సామర్థ్యం పెంచుకోవడం ద్వారా ఆర్థిక స్థితి మరింత అద్భుతంగా మారుతుందని హెచ్‌ఏఎల్‌ను ఉద్దేశించి రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. 2019 సంవత్సరం మార్చి నాటికి హాల్ టర్నోవర్ 19వేల 705 కోట్లు ఉండగా.. షేర్‌హోల్డర్లు 198 శాతం డివిడెండ్‌ను అందుకొంటున్నారని పేర్కొన్నారు. కంబాలా రన్నింగ్ పోటీల్లో కేవలం 9.55 సెకండ్లలో వంద మీటర్ల పరుగును అధిగమించిన శ్రీనివాస్ గౌడను ఈ సందర్భంగా రక్షణ మంత్రి అభినందించారు.
*చిత్రం... కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్