జాతీయ వార్తలు

తీర ప్రాంత గస్తీ నౌక వజ్ర ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఫిబ్రవరి 27: సముద్ర తీర ప్రాంతంలో భద్రతను పెంపొందించడానికి ఉపయోగపడే ఆరో తీరప్రాంత గస్తీ నౌక ‘యార్డ్ 45006 వజ్ర’ను కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ, ఇతర సీనియర్ ప్రభుత్వ అధికారుల సమక్షంలో గురువారం నాడిక్కడ లాంఛనంగా ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం కింద లార్సెన్ అండ్ టౌబ్రో ఈ నౌకను నిర్మించిందని, ఈ నౌకను రాత్రింబవళ్లు గస్తీ కోసం ఉపయోగించడం జరుగుతుందని మాండవీయ ఈ సందర్భంగా తెలిపారు. ఇక్కడి కట్టుపల్లి ఓడరేవు వద్ద గల ఎల్‌అండ్‌టీ షిప్‌బిల్డింగ్ లిమిటెడ్ వద్ద మంత్రి మాండవీయ సతీమణి గీతా మాండవీయ ఈ నౌకను ప్రారంభించారు. కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ కె.నటరాజన్, సీనియర్ ప్రభుత్వ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘కట్టుదిట్టమయిన తీర ప్రాంత భద్రతకు హామీ ఉండాలనే నిబద్ధతతో కట్టుపల్లి వద్ద గల లార్సెన్ అండ్ టౌబ్రో షిప్‌బిల్డింగ్ లిమిటెడ్ వద్ద ఆరో తీర ప్రాంత గస్తీ నౌక వజ్రను ప్రారంభించడం జరిగింది’ అని మంత్రి మాండవీయ అన్నారు. ‘అత్యంత ఆధునిక ఛోదక, భావప్రసార వ్యవస్థలు కలిగిన ఈ వజ్ర నౌక రాత్రింబవళ్లు గస్తీ కోసం ఉపయోగపడుతుంది’ అని ఆయన పేర్కొన్నారు. కోస్ట్ గార్డ్ వెల్లడించిన వివరాల ప్రకారం, కేంద్ర ప్రభుత్వ ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం కింద లార్సెన్ అండ్ టౌబ్రో షిప్‌బిల్డింగ్ లిమిటెడ్ డిజైన్ చేసి, దేశీయంగా నిర్మిస్తున్న ఏడు తీర ప్రాంత గస్తీ నౌకల ప్రాజెక్టులో వజ్ర నౌక ఆరోది. ఈ నౌకకు స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మెషినరి, ఎక్విప్‌మెంట్, నావిగేషన్ వ్యవస్థలను బిగించారు. గురువారం ప్రారంభించిన ఈ వజ్ర నౌకను విస్తృతంగా పరీక్షించిన తరువాత కోస్ట్ గార్డ్‌లోకి ప్రవేశపెడతారు. 98 మీటర్ల పొడవు, 15 మీటర్ల వెడల్పు కలిగిన ఈ వజ్ర నౌక 2,100 టన్నుల బరువు ఉంది. రెండు డీజిల్ డ్రైవెన్ ఇంజిన్లు కలిగిన ఈ నౌక గరిష్ఠ వేగం 26 కిలోనాట్స్.