జాతీయ వార్తలు

బతికున్నారా? లేదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: సొంతవారిని కోల్పోయిన బాధ ఓపక్క.. గాయపడ్డ వారు సజీవంగా బయటకు వస్తారో? లేదోనన్న ఆందోళన మరోవైపు ఈశాన్య ఢిల్లీ వాసులను కన్నీరుమున్నీరు చేస్తోంది. ఇక్కడి జీటీబీ ఆసుపత్రి మార్చురీలో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించడంతో వాటిని ఎప్పుడు తమకు అప్పగిస్తారో అంటూ గంటల తరబడి సంబంధిత కుటుంబాలు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నాయి. అలాగే, అల్లర్లలో గల్లంతైన వారి జాడ తెలియక అనేకమంది ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. తమవారెవరైనా ఆసుపత్రికి గాయపడ్డ స్థితిలో కానీ.. మరణించిన స్థితిలో కానీ చేరారేమోనన్న ఆందోళన వీరిని పీడిస్తోంది. గత రెండు రోజులుగా తాము జీటీబీ ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్నామని.. పోస్టుమార్టం తరువాత తమవారి మృతదేహాలను ఎప్పుడు అప్పగిస్తారోనని ఎదురుచూస్తూనే ఉన్నామని 35 సంవత్సరాల ముదసిర్ ఖాన్ బంధువులు చెబుతున్నారు. అల్లర్లలో ముదసిర్ ఖాన్ మరణించడం దిగ్భ్రాంతి కలిగించిందని తెలిపారు. ఇప్పటికీ కూడా ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలో భయం మధ్యే ప్రజలు బతుకుతున్నారని.. అర్బాద్‌ఖాన్ అనే వ్యక్తి తెలిపాడు. ఎవరికీ నిద్ర పట్టడం లేదని.. స్కూళ్లు మూతపడ్డాయని అన్నారు. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే పరిస్థితి ఇంత దారుణంగా క్షీణించడానికి కారణం ఏమిటో అంతుపట్టడం లేదన్న అభిప్రాయం అందరిలో వ్యక్తవౌతోంది. ఇక పోస్టుమార్టం విషయంలో ఆసుపత్రి అధికారులు వ్యవహరిస్తున్న తీరు పట్ల కూడా బాధితుల తరఫు బంధువులు అవాక్కౌతున్నారు. ఈనెల 25న తమ 22 ఏళ్ల కుమార్తె షాబాజ్ గల్లంతైందనీ.. ఆమె బతికుందో? లేదో? తెలుసుకోవడానికి ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్నా ఎవరిని నుంచి ఎలాంటి స్పందనా లేదని మరో బాధితురాలు తెలిపారు.
*చిత్రాలు.. న్యూఢిల్లీలోని జీటీబీ ఆస్పత్రి మార్చూరీ వద్ద తన కుమారుడి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించొద్దని కన్నీరు పెడుతున్న మహ్మద్ ఇర్ఫాన్ తల్లి ఖురేషా.
*తప్పిపోయన షాబాజ్ అనే వ్యక్తి తల్లి ముకిమా ఖాతూన్ గురువారం జీటీబీ ఆస్పత్రి మార్చూరీ వద్ద విలపిస్తున్న దృశ్యం.