జాతీయ వార్తలు

చైనా నుంచి భారత్‌కు చేరిన 112 మంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: భారత్ ప్రాణాంతకమయిన కరోనా వైరస్ తీవ్రంగా ప్రబలిన చైనాలోని వూహాన్ నగరం నుంచి 112 మందిని గురువారం వెనక్కి తీసుకువచ్చింది. అలాగే ఈ వైరస్ సోకిన నౌకలో ప్రయాణిస్తున్న మరో 124 మందిని టోక్యో నుంచి స్వదేశానికి తీసుకొచ్చింది. భారత వాయుసేన (ఐఏఎఫ్)కు చెందిన ఒక సీ-17 గ్లోబ్‌మాస్టర్ 3 రవాణా విమానం వూహాన్ నగరం నుంచి 76 మంది భారతీయులను, 36 మంది విదేశీయులను భారత్‌కు తీసుకు వచ్చింది. అలాగే, ఎయిరిండియాకు చెందిన ఒక విమానం 124 మందిని టోక్యో నగరం నుంచి తీసుకు వచ్చింది. వూహాన్ నగరం నుంచి తీసుకువచ్చిన విదేశీయులలో 23 మంది బంగ్లాదేశ్‌కు చెందిన వారు, ఆరుగురు చైనాకు చెందిన వారు, మైన్మార్, మాల్దీవులకు చెందిన వారు ఇద్దరేసి, దక్షిణాఫ్రికా, అమెరికా, మడగాస్కర్‌లకు చెందిన వారు ఒక్కొక్కరు ఉన్నారు. 119 మంది భారతీయులతో పాటు జపాన్ నుంచి తీసుకొచ్చిన వారిలో శ్రీలంకకు చెందిన వారు ఇద్దరు, నేపాల్, దక్షిణాఫ్రికా, పెరులకు చెందిన వారు ఒక్కొక్కరు ఉన్నారు. కరోనా వైరస్ సోకిన డైమండ్ ప్రినె్సస్ నౌకలో ఉన్న మొత్తం 3,711 మందిలో భారత్‌కు తీసుకొచ్చిన వారు కూడా ఉన్నారు. టోక్యోకు సమీపంలోని యొకొహామా ఓడరేవు వద్దకు చేరుకున్న ఈ నౌకలోనుంచి భారత్ వీరిని తీసుకువచ్చింది. భారత్ తన ‘నైబర్‌హుడ్ ఫస్ట్ పాలసి’, ‘ఇండో-పసిఫిక్ విజన్’లకు అనుగుణంగా అయిదుగురు విదేశీయులు- ఇద్దరు శ్రీలంకకు చెందిన వారు, ఒకరు నేపాల్‌కు చెందిన వారు, ఒకరు దక్షిణాఫ్రికాకు చెందిన వారు, ఒకరు పెరూకు చెందిన వారిని తీసుకు వచ్చింది’ అని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. డైమండ్ ప్రినె్సస్ నౌకలోని సిబ్బందిలో ఉన్న ముగ్గురు భారతీయులు ఎయిరిండియా విమానంలో భారత్‌కు రాలేదు. నౌకలోనే ప్రయాణిస్తామని, జపాన్ ప్రభుత్వం నిర్ణయించిన గడువు వరకు తాము నౌకలో ప్రత్యేకంగా ఉంటామని వారు చెప్పారు. డైమండ్ ప్రినె్సస్ నౌకలో ఉన్న మొత్తం 138 మంది భారతీయుల్లో 16మంది సిబ్బందికి కరోనా వైరస్ సోకినట్టు వైద్య పరీక్షల్లో తేలింది. వారు జపాన్‌లోని సాగరతీరంలో గల ఒక వైద్య కేంద్రంలో చికిత్స పొందుతున్నారు. భారత్‌కు తీసుకొచ్చిన వారందరిని 14 రోజుల పాటు ఇండియన్ ఆర్మీ మానేసర్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య కేంద్రంలో విడివిడిగా ఉంచుతారు.