జాతీయ వార్తలు

ఇది సార్క్ సఖ్యతకు నిదర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: సార్క్ దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదనకు విశేష స్పందన వస్తోంది. తాజాగా మాల్దీవులు, భూటాన్, నేపాల్ ప్రభుత్వాలు కోవిడ్-19 ఎమర్జెన్సీ నిధికి భారీ ఎత్తున నిధులు అందించాయి. ఈ దేశాలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల సార్క్ దేశాల అధ్యక్షులు, ప్రధానులనుద్ధేశించి వీడియో ద్వారా మాట్లాడిన మోదీ ఈ ఎమర్జెన్సీ నిధి ప్రతిపాదన చేశారు. భారత్ తరఫున 10 మిలియన్ డాలర్ల సహాయాన్ని ప్రకటించారు. కాగా మాల్దీవుల ప్రభుత్వం రెండు లక్షల డాలర్లను ఈ నిధి కోసం ఇవ్వడం అభినందనీయమని దీనిని బట్టి చూస్తే ఈ మహామ్మారిని ఉమ్మడిగా ఎదుర్కొవాలన్న సార్క్ దేశాల పట్టుదల కనిపిస్తోందని మోదీ తెలిపారు. అలాగే లక్ష డాలర్లను అందించిన భూటాన్ ప్రధాని లోటేష్ శరీన్ కూడా మోదీ అభినందించారు. సార్క్‌లోని సభ్య దేశాలన్నీ ఉమ్మడిగా ఈ వైరస్‌పై కలిసి రావడం కొత్త ఉత్సాహన్ని అందిస్తోందని మోదీ తెలిపారు. అలాగే ఈ వైరస్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో సహకరిస్తున్న వివిధ సంస్థలు, వ్యాపార సంస్థలకు కూడా ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఈ వైరస్‌కు భయపడాల్సిన అవసరం లేదని, అయితే ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కేవలం ఇంట్లో ఉండడమే కాకుండా ఉన్న చోటే ఉండడం కూడా ఈ వైరస్ వ్యాప్తి నిరోధనకు తోడ్పడినట్లు అవుతుందన్నారు. ఈ ఆపద సమయంలో మనం వేసే ప్రతి అడుగు మంచి ఫలితాన్ని ప్రభావాన్ని కనబరుస్తున్నదన్న విషయాన్ని మరచి పోవద్దన్నారు.
అనవసర ప్రయాణాల వల్ల అవి చేస్తున్న వారికే కాకుండా ఇతరులకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. అధికారులు, వైద్యులు ఇచ్చే సలహాలను ప్రజలు పాటించాలని స్పష్టం చేశారు. క్వారంటైన్ అవసరం ఉన్న వ్యక్తులు అందుకు సహకరించాలని, దీని వల్ల వారి కుటుంబ సభ్యులకే కాకుండా అందరికీ మేలు జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఆయన కరోనా వైరస్ ఏ విధంగా వ్యాపిస్తుంది. చిన్న, చిన్న ముందు జాగ్రత్తలతో దానిని ఎలా నివారించవచ్చో తెలియజేసే ఓ వీడియోను కూడా చూపించారు.

*చిత్రం... ప్రధాని మోదీ