జాతీయ వార్తలు

కరోనా వెబ్‌సైట్ ప్రారంభించిన ‘సార్క్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 22: ఇటీవలి సార్క్ సమావేశాల్లో ప్రపంచ మహమ్మారిగా మారిన కరోనా నియంత్రణకు సభ్య దేశాలు సహకరించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సందర్భంగా సార్క్ విపత్తుల నిర్వహణా కేంద్రం ఆదివారం కరోనా వైరస్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేసే విధంగా వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. వెబ్‌సైట్‌లో సార్క్ దేశాల్లో ఎప్పటికప్పుడు ఎంతమంది వైరస్ బారినపడ్డారో ఎప్పటికప్పుడు సమాచారం అప్‌డేట్ అవుతూ ఉంటుంది. సార్క్ దేశాల్లో ఇప్పటికి కరోనా పాజిటివ్ కేసులు 960 నమోదు కాగా ఒక్క పాకిస్తాన్‌లోనే 495 కేసులు నమోదయ్యాయి. భారత్‌లో 324, శ్రీలంకలో 77, ఆఫ్గానిస్తాన్‌లో 24, బంగ్లాదేశ్‌లో 24, మాల్దీవుల్లో 13, భూటాన్‌లో రెండు, నేపాల్‌లో ఒక్క కేసు మాత్రమే నమోదైనట్లు వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. కాగా, భారత్‌లో ఐదుగురు కరోనా పాజిటివ్‌తో మరణించారనీ.. పాక్‌లో ముగ్గురు, బంగ్లాదేశ్‌లో ఇద్దరు మరణించినట్లు పేర్కొన్నారు. రీజియన్ ప్రణాళిక నుంచి చర్యల వరకు సార్క్ దేశాల విపత్తు నిర్వహణా కేంద్రం వెబ్‌సైట్ ప్రారంభించాలని వీడియో కాన్ఫరెన్స్‌లో కోరిన మేరకు వెబ్‌సైట్ ప్రారంభమైందని కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ ట్వీట్ చేశారు.