జాతీయ వార్తలు

నల్లధనంపై పోరును బలహీనపరచే ప్రయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 24: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యక్తిగతంగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై బిజెపి తీవ్రస్థాయిలో మండిపడింది. నల్లధనంపై పోరాటాన్ని బలహీన పరచడానికే రాహుల్ గాంధీ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఎదురుదాడికి దిగింది. ‘ప్రధాని మోదీ తీసుకున్న చర్యల వల్ల నేడు దేశం నల్లధనంపై పోరులో ముందుకు సాగుతోంది. దేశాన్ని అవినీతి రహిత భారత్‌గా మార్చాలని కోరుకుంటున్నారు’ అని బిజెపి ఎంపి షానవాజ్ హుస్సేన్ అన్నారు. ముంబయి శివారులోని బాంద్రాలో గల ఒక కూడలికి ప్రముఖ గాయకుడు మొహమ్మద్ రఫీ పేరు పెట్టారు. మొహమ్మద్ రఫీ చౌక్‌గా నామకరణం చేయడానికి శనివారం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న షానవాజ్ విలేఖరులతో మాట్లాడారు. నిరాధార ఆరోపణలు చేయడం ద్వారా రాహుల్ గాంధీ నల్లధనంపై పోరును బలహీనపరచడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు.