జాతీయ వార్తలు

రామ్మోహన్‌రావుకు గుండెపోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, డిసెంబర్ 24: తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి పి రామ్మోహన్‌రావు గుండెపోటు రావడంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ఆదాయపన్ను అధికారులు ఇటీవల రామ్మోహన్‌రావు, ఆయన బంధువుల ఇళ్లపై దాడులచేసి పెద్ద మొత్తంలో నగదు, బంగారం స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనను సస్పెండ్ చేశారు. శనివారం తెల్లవారుజామున 1 గంటల సమయంలో రామ్మోహన్ రావుకు చాతినొప్పి రావడంతో శ్రీరామచంద్రా ఆసుపత్రిలో చేర్చారు. ‘చాతినొప్పితో తీవ్ర అస్వస్థతకు గురైన రావును ఆసుపత్రికి తీసుకొచ్చారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు’ అని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉంచి మాజీ సిఎస్‌ను పరీక్షిస్తున్నట్టు వారు తెలిపారు. పెద్దనోట్ల రద్దు తరువాత ఐటి అధికారులు జరిపిన దాడుల్లో రామ్మోహన్‌రావు వద్ద భారీ ఎత్తున నగదు, బంగారం లభించింది. ఆయన బంధువుల ఇళ్లపైనా ఐటి దాడులు జరిగాయి. పెద్దఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడి ఆస్తులు కూడబెట్టారని ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దీన్ని తీవ్రంగా పరిగణించిన తమిళనాడు ప్రభుత్వం ఈ నెల 22న సిఎస్ పదవి నుంచి తప్పించి అడిషనల్ చీఫ్ సెక్రెటరీ గిరిజా వైద్యనాథన్‌ను నియమించారు. అన్నానగర్‌లోని రావు నివాసం, కుమారుడు, బంధువుల ఇళ్లపై ఐటి దాడులు జరిగాయి. రామ్మోహన్‌రావు ఇల్లు, కార్యాలయంపై జరిపిన దాడుల్లో 30 లక్షల రూపాయల కొత్త నోట్లు, ఐదు కిలోల బంగారం దొరికింది.