అంతర్జాతీయం

ఇదేనా మీ నాగరికత?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, మే 6: కర్నాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిమయమని, అన్ని రంగాల్లోనూ ఈ జాడ్యం పేరుకుపోయిందంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న విమర్శలపై రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదివారం తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాటలు, హావభావాలు, జనాన్ని ఆకర్షించాలన్న లక్ష్యంతో కూడుకున్నవేనని అందుకే తమపై వ్యక్తిగత విమర్శలకు దిగుతూ ప్రచార ప్రామాణికతను దిగజారుస్తున్నారని సిద్ధరామయ్య అన్నారు. ప్రధాని పదవి నిర్వహిస్తున్న వ్యక్తి స్థాయికి ఏమాత్రం తగని రీతిలో మోదీ వాడుతున్న భాష ఉందని అన్నారు. ముఖ్యంగా సిద్ధరామయ్య ప్రభుత్వం కమిషన్లతో కూడుకున్న ప్రభుత్వమని నేరుగానే ముడుపులు అందుతున్నాయంటూ ప్రధాని చేసిన వ్యాఖ్యల పట్ల సిద్ధరామయ్య తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకరకంగా చెప్పాలంటే రాష్ట్రంలో బీజేపీకి రాజకీయంగా ఎలాంటి బలం లేదని, 12న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ వచ్చి మాట్లాడితే తప్ప ఈ పార్టీకి బలమైన నాయకుడే కరువయ్యాడని సిద్ధరామయ్య అన్నారు.
ఎన్నికల ప్రచారంలో మోదీ నుంచి సభ్యతాయుతమైన భాషనే తాము ఆశించామని, కాని ఆయన మాట్లాడుతున్న తీరు ఇందుకు పూర్తి భిన్నంగా ఉందన్నారు. బీజేపీ భాషనే ఆయన వాడుతున్నారు తప్ప ఓ నాగరికమైన వ్యక్తిగా ఎన్నికల సభలో మాట్లాడడం లేదని మీడియా సమావేశంలో సిద్ధరామయ్య ధ్వజమెత్తారు. కేంద్రంలోని బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం సాధించిన విజయాలను ఏకరవు పెడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా విఫలమైందన్న దానిపై మోదీ తన ప్రసంగాన్ని కేంద్రీకృతం చేస్తే బాగుండేదని, కాని అందుకు భిన్నంగా ఆయన అభ్యంతరకర రీతిలో తనపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని అన్నారు. తనకు సంబంధించినంతవరకు ఎవరిపైనా వ్యక్తిగత విమర్శలకు దిగలేదని, ఎదుటివారు నొచ్చుకునే భాషనూ ఎప్పుడూ వాడలేదని స్పష్టం చేశారు. కాని మోదీ మాట్లాడుతున్న తీరు సభ్యతా నియమాలను తుంగలో తొక్కింది కాబట్టే తాను ప్రతిస్పందించక తప్పని పరిస్థితి ఏర్పడిందన్నారు. తనది కమిషన్ల ప్రభుత్వం అంటూ మోదీ చేసిన విమర్శలను ప్రస్తావించిన ఆయన ‘ఇందుకు సంబంధించి మీ దగ్గర ఉన్న ఆధారాలేమిటి’ అని ప్రశ్నించారు. మోదీ చేతిలోనే అన్ని కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలు ఉన్నాయని, కర్నాటక ప్రభుత్వ అవినీతికి సంబంధించి ఆధారాలుంటే వాటిని బహిర్గతం చేయవచ్చునని అన్నారు. అలా చేయకుండా జనాన్ని ఆకర్షించడం కోమే మోదీ మాట్లాడుతున్నారే తప్ప అందులో ఎలాంటి పస లేదని అన్నారు.