జాతీయ వార్తలు

బీజేపీకి పిలుపు రాజ్యాంగ విరుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 16: కర్నాటకలో ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానించటం ద్వారా గవర్నర్ రుడాభాయ్ వాజూభాయ్ వాలా ఎమ్మెల్యేల కొనుగోలుకు అవకాశం కల్పిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్లు, ఎంపీలు పి చిదంబరం, కపిల్ సిబల్ ఆరోపించారు. ఇరువురు సీనియర్ నేతలు బుధవారం రాత్రి ఏఐసీసీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గవర్నర్ వాలా బీజేపీ శాసన సభాపక్ష పార్టీ నాయకుడు యెడ్యూరప్పను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించటం రాజ్యాంగ విరుద్దం. దీనిపై తాము రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఫిర్యాదు చేయటంతోపాటు సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేస్తామని సూచనప్రాయంగా చెప్పారు. గోవా, మణిపూర్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏకైక పెద్ద పార్టీగా అవతరించినా ఆయా రాష్ట్రాల గవర్నర్లు మాత్రం ఎక్కువమంది సభ్యులను సమకూర్చుకున్న బీజేపీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించారు. అదే పద్ధతిలో కర్నాటకలో
ఎక్కువ మంది ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్, జేడీ(ఎస్) కూటమిని ఎందుకు ఆహ్వానించటం లేదని ప్రశ్నించారు. గవర్నర్ కార్యాలయంలో బీజేపీ నేతలు తిష్టవేశారని ఆరోపించారు. బీజేపీ కర్నాటకలో మన్ కీ బాత్ బదులు ధన్ కీ బాత్ చేస్తోందని దుయ్యబట్టారు. గవర్నర్ వాలా రాజ్యాంగ పద్ధతిలో వ్యవహరించి జేడీ(ఎస్), కాంగ్రెస్ కూటమిని ప్రభుత్వం ఏర్పాటుకు అహ్వానించాలన్నారు. గవర్నర్ వాలా బీజేపీ నాయకుడు యెడ్యూరప్పను ఆహ్వానించటం రాజ్యాంగ విరుద్దమన్నారు. మెజారిటీలో ఉన్న జేడీ(ఎస్), కాంగ్రెస్ కూటమిని ఆహ్వానించటం ద్వారా రాజ్యాంగాన్ని పరిరక్షించాలని గవర్నర్‌ను డిమాండ్ చేశారు. గవర్నర్ నిర్ణయంపై జేడీ(ఎస్), కాంగ్రెస్ కూటమి న్యాయపరంగా పోరాడాలని యోచిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు తగిన బలం తమకుందని, 56 శాతం ఓట్లు తమ కూటమికి వచ్చాయని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. గవర్నర్ నిర్ణయాన్ని న్యాయపరంగా ఏవిధంగా ప్రతిఘటించాలనే అంశంపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది. రాజ్యాంగపరంగా గతంలో న్యాయస్థానం ఇచ్చిన తీర్పులు, సంప్రదాయాలను కాంగ్రెస్ చురుకుగా పరిశీలిస్తోంది.