జాతీయ వార్తలు

శివాజీ మెమోరియల్‌కు ‘జలపూజ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 24: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం అరేబియా సముద్రంలో రూ.3,600 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్న ఛత్రపతి శివాజీ మెమోరియల్‌కు శంకుస్థాపన చేశారు. రాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే లాంటి కొంతమంది ఎంపిక చేసిన ప్రముఖులతో కలిసి దక్షిణ ముంబయిలోని గిర్‌గామ్ చౌపాతి బీచ్‌నుంచి హోవర్ క్రాఫ్ట్‌లో ప్రయాణించిన ప్రధాని తీరానికి దాదాపు కిలోమీటరున్నర దూరంలో అరేబియా సముద్రంలో ఉన్న మెమోరియల్ నిర్మాణ స్థలానికి చేరుకున్నారు. అక్కడ ఆయన మెమోరియల్‌కు శంకుస్థాపనకు గుర్తుగా జలపూజను నిర్వహించారు. ఛత్రపతి శివాజీ వంశీకులైన ఉదయన్ రాజే భోంస్లే, శంభాజీ రాజే కూడా ప్రత్యేక నౌకపై ప్రధాని వెంట ఉన్నారు. ఈ కార్యక్రమానికి ముందు ముఖ్యమంత్రి ఫడ్నవిస్ వివిధ నదులు, మహారాష్టల్రోని అన్ని జిల్లాలనుంచి సేకరించిన మట్టితో ఉన్న ఒక కలశాన్ని ప్రధానికి అందజేశారు. నౌక మెమోరియల్ నిర్మించే స్థలానికి చేరుకున్నప్పుడు ఆయన ఆ కలశాన్ని అరేబియా సముద్రంలో నిమజ్జనం చేశారు.
అరేబియా సముద్రంలోని ఓ రాక్‌పై 192 మీటర్ల ఎత్తులో అశ్వంపై అధిరోహించిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఈ మెమోరియల్‌లో భాగంగా ఏర్పాటు చేస్తారు. ఈ విగ్రహం పూర్తయ్యాక ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహం అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. మెమోరియల్‌లో భాగంగా ఒక మ్యూజియం, యాంఫీ థియేటర్, ఆడిటోరియం, ఎగ్జిబిషన్ గ్యాలరీని కూడా ఏర్పాటు చేస్తారు.
అంతకుముందు ప్రధాని మోదీ ఛత్రపతి శివాజీ పట్ట్భాషేకాన్ని గుర్తుకు తెచ్చే విధంగా ఏర్పాటు చేసిన ఒక ప్రదర్శనను సైతం తిలకించారు. ఈ సందర్భంగా ఆయన ఛత్రపతి శివాజీ సేవలను కొనియాడారు. శివాజీ ప్రజా సమస్యలను పరిష్కరించి సుపరిపాలనను అందించారని అన్నారు. బ్రిటిష్ వ్యతిరేక పోరాటంలో ప్రజల్లో శివాజీ స్ఫూర్తి నింపారని కొనియాడారు. రైతులు, వ్యాపారుల్లో చైతన్యం తీసుకువచ్చారన్నారు. ఒక మరాఠా యోధుడిగానే మనకు శివాజీ తెలుసునని, ఆయనకు సంబంధించిన అనేక అంశాల గురించి మనం తెలుసుకోవలసిన అవసరం ఉందని ప్రధాని అన్నారు.

చిత్రం..ముంబయిలోని గిర్‌గామ్ చౌపాతి బీచ్‌నుంచి హోవర్ క్రాఫ్ట్‌లో ప్రయాణించి జల పూజ చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ