జాతీయ వార్తలు

దేశాన్ని మోదీ రెండుగా చీల్చారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మశాల, డిసెంబర్ 24: పెద్ద నోట్ల రద్దుపై ప్రధాని మోదీపై ప్రతిరోజూ విమర్శలు కురిపిస్తున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన స్వరాన్ని మరింత పెంచారు. వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో శనివారం జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ, పెద్ద నోట్ల రద్దు దేశ నగదు వ్యవస్థపైన, నిరుపేదలపైన ‘పిడుగుపాటు’గా అభివర్ణించారు. ప్రధాని మోదీ దేశాన్ని రెండు భాగాలుగా చీలుస్తున్నారన్న ఆయన ఒక భాగంలో దేశ జనాభాలో ఒక శాతం ఉన్న అవినీతిపరులైన సంపన్నులుంటే, మరో భాగంలో 99 శాతం ఉన్న నిజాయితీపరులైన తమ చెమటతో ఈ దేశాన్ని నిర్మించిన రైతులు, కార్మికులు,పేదలు, మధ్యతరగతి వారుంటున్నారన్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో ప్రధాని మోదీ హిమాచల్ ప్రదేశ్ సంప్రదాయ టోపీనే తొలగించారని, ఎందుకంటే ఈ నిర్ణయం కారణంగా హిమాచల్ ప్రదేశ్ వ్యవసాయ, పర్యాటక, ఉద్యానవన రంగాలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆయన అన్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో హిమాచల్ ప్రదేశ్ రైతుల్లో కార్చిచ్చును రగిల్చారని ఆయన విమర్శించారు. నోట్లకు రంగు ఉండదని, అది అవినీతిపరుల చేతుల్లోకి వెళ్లినప్పుడు మాత్రమే నల్లడబ్బుగా మారుతోందని ఆయన అన్నారు. దేశంలోని నల్లధనంలో ఆరుశాతం మాత్రమే నగదు రూపంలో ఉందని, మిగతాది అంతా బంగారం, నగలు, రియల్ ఎస్టేట్ లాంటి రూపాల్లో ఉందని ఆయన అన్నారు. బిజెపి ఢిల్లీలో బ్యాంకు క్యూలలో నిలబడిన వారికి 3 రూపాయల లడ్డూలు పంచిపెట్టిందని, అదే విజయ్ మాల్య 1200 కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోతే చూస్తూ ఊరుకుందని ఆయన విమర్శించారు. మధ్యప్రదేశ్, జార్ఖండ్, చత్తీస్‌గఢ్‌లలో బిజెపి ప్రభుత్వాలు కేవలం ఆదివాసీల భూములనే లాక్కొంటున్నాయని రాహుల్ అన్నారు. ప్రధాని మోదీ తనను అవహేళన చేస్తున్నారని, అయినా సరే ఆయనను వదిలిపెట్టేది లేదని కూడా రాహుల్ అన్నారు. ఈ ర్యాలీలో రాహుల్‌తోపాటుగా హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్, రాష్ట్రానికి చెందిన ఇతర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

చిత్రం..ధర్మశాలలో శనివారం కాంగ్రెస్ నిర్వహించిన ర్యాలీలో కార్యకర్తలు బహూకరించిన సంప్రదాయ టోపీని సరిచేసుకుంటున్న రాహుల్