జాతీయ వార్తలు

సత్తా చూపిద్దాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* బీజేపీయేతర శక్తులతో బలప్రదర్శనకు కాంగ్రెస్ సిద్ధం
న్యూఢిల్లీ, మే 22: కర్నాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి చేసే ప్రమాణ స్వీకారోత్సవాన్ని బీజేపీ వ్యతిరేక శక్తుల బలమైన వేదికగా మారబోతోంది. బీజేపీ వ్యతిరేక పార్టీలు, నేతలను సాధ్యమైనంతగా ఎక్కువ సంఖ్యలో ఆహ్వానించడం ద్వారా, ప్రతిపక్ష బలమేమిటో మోదీ, అమిత్ షాలకు తెలియజేసేందుకు సన్నద్ధం అవుతోంది. కర్నాటక కొత్త ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ప్రమాణ స్వీకారోత్సవం పేరుతో బీజేపీయేతర పార్టీలు బల ప్రదర్శనకు దిగనున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యూహం ప్రకారమే కుమారస్వామి తన ప్రమాణ స్వీకారోత్సవానికి పదమూడు మంది ముఖ్యమంత్రులు, సీనియర్ నాయకులను బెంగళూరుకు ఆహ్వానించారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బీఎస్‌పీ అధ్యక్షురాలు మాయావతి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, రాష్ట్రీయ జనతాదళ్ అధినాయకుడు తేజస్వీ యాదవ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్రీయ లోక్‌దళ్ అధ్యక్షుడు అజిత్‌సింగ్, సినిమాల నుండి రాజకీయాల్లోకి వచ్చిన మక్కల్ నిధి మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్‌హసన్, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ కుమారస్వామి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కానున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కూడా ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతారని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నా మంగళవారమే చంద్రశేఖరరావు కుమారస్వామిని అభినందించి బెంగళూరుకు వెళ్లారు. చంద్రశేఖరరావుకు కొన్ని ముఖ్యమైన పనులు ఉన్నాయంటూ ప్రమాణ స్వీకారోత్సవానికి బదులు ఒకరోజు ముందే బెంగళూరుకు వెళ్లి కుమారస్వామిని అభినందించి రావటం ఢిల్లీలో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్‌తో కలిసి వేదికను పంచుకోవటం రాజకీయంగా మంచిది కాదనే అభిప్రాయంతోనే ఆయన ఈ విధంగా చేశారనే మాట వినిపిస్తోంది.
ఇదిలా ఉండగా కుమార్ స్వామి ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ఎక్కువ మంది ప్రతిపక్ష నాయకులను ఒకే వేదిక పైకి తీసుకురావటం ద్వారా బీజేపీతోపాటు దేశ ప్రజలకు కూడా ఒక స్పష్టమైన సందేశం పంపించాలని కాంగ్రెస్ భావిస్తోంది. కర్నాటకలో బీజేపీ అధికారంలోకి రాకుండా చేసినట్లే 2019 లోక్‌సభ ఎన్నికల్లో కూడా ప్రతిపక్షాలన్నీ కలిసి బీజేపీని అధికారంలోకి రాకుండా చేస్తామనే సందేశాన్ని దేశ ప్రజలకు పంపించాలన్నది కాంగ్రెస్ వ్యూహం. జాతీయ, ప్రాంతీయ పార్టీల నాయకులతో బలాన్ని ప్రదర్శించే అంశంపై రాహుల్ గాంధీ మంగళవారం పార్టీ సీనియర్ నాయకులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. ఈ సంవత్సరాంతానికి మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల శాసనసభల ఎన్నికలు, ఆ తరువాత 2019 ఏప్రిల్, మే నెలలో లోక్‌సభ ఎన్నికలు వస్తున్నందున బెంగళూరు బలప్రదర్శనకు ఎంతో ప్రాధాన్యత ఉన్నదని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తోంది. కాంగ్రెస్ నాయకత్వంలో బీజేపీ యేతర పార్టీల సమీకరణ జరుగుతోందనే అభిప్రాయం కలిగించాలనే తాపత్రయం కాంగ్రెస్‌లో కనిపిస్తోంది. అయితే రాహుల్ గాంధీ నాయకత్వంలో పని చేసేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఎస్‌పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, బీఎస్‌పీ అధ్యక్షురాలు మాయావతి ఇష్టపడటం లేదు. రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేయటం అంటే ఓటమిని చవిచూడటమనే అభిప్రాయాన్ని ఈ నాయకులు వ్యక్తం చేశారు. ఈ అభిప్రాయం తప్పు అని కాంగ్రెస్ నాయకులు రుజువు చేయాలనుకుంటున్నారు. రాహుల్ గాంధీ మెరుపువేగంతో తీసుకున్న నిర్ణయం మూలంగానే జేడీ(ఎస్) అధ్యక్షుడు కుమారస్వామి నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకోవటంతోపాటు ఆ వెంటనే మాజీ ప్రధాన మంత్రి దేవేగౌడ, కుమారస్వామితో చర్చించి సంకీర్ణాన్ని ఏర్పాటు చేసేందుకు రంగాన్ని సిద్ధం చేయటం, రెండు పార్టీల శాసనసభ్యులను బీజేపీ తన్నుకుపోకుండా చూసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవటం జరిగిందనే సందేశాన్ని ఇతర ప్రతిపక్షాలకు పంపించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.