రాష్ట్రీయం

మింగేస్తున్న వాయుకాలుష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 22: వాయు కాలుష్యం వల్ల దేశంలో అకాల మృత్యువు బారినపడే వారి సంఖ్య పెరిగింది. వాయు కాలుష్యం ప్రభావంపై ఢిల్లీ ఐఐటి సర్వే నిర్వహించింది. సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ అండ్ ఎనర్జీ డెవలప్‌మెంట్ (సీడ్) సహకారంతో ‘మీ శ్వాస గురించి తెలుసుకోండి’ అనే కానె్సప్ట్‌పై ఢిల్లీ ఐఐటి విద్యార్థులు సర్వే నిర్వహించారు. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్కాండ్ రాష్ట్రాల్లో ఈ సర్వే జరిగింది. ప్రతి లక్ష మందిలో సాలీనా 150 నుంచి 300 మంది వరకు వ్యక్తులు వాయు కాలుష్యం తీవ్రత వల్ల అకాల మృత్యువాత పడుతున్నారని తేలింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన పరిమితులకు లోబడి వాతావరణంలో వాయు కాలుష్య సూచీలు ఉండాలి. పిఎం 2.5 స్థాయిలో పరిమాణంలో వాయుకాలుష్యం ఉంది. వాయు కాలుష్యం పెరగడం వల్ల శ్వాసకోశ వ్యవస్థ దెబ్బతింటోంది. ఊపిరితిత్తుల పనితీరును స్తంభింపచేస్తున్నాయి. జాతీయ స్థాయిలో వాయు కాలుష్యం పెరగడం వల్ల ప్రజారోగ్యం దెబ్బతింటోందని, దీనిపై కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు వెంటనే మేల్కొనాల్సిన అవసరం ఉందని సీడ్ ప్రొగ్రాం డైరెక్టర్ అభిషేక్ ప్రతాప్ తెలిపారు. గత 17 సంవత్సరాలుగా సేకరించిన శాటిలైట్ డాటాను రూపొందించినట్లు ఆయన చెప్పారు. ఈ కాలుష్యం దేశంలో పశ్చిమ ప్రాంతం నుంచి తూర్పు ప్రాంతంవైపు వ్యాపిస్తోందన్నారు. వారణాసిలో కూడా వాయుకాలుష్యం తీవ్రంగా ఉందన్నారు. మీరట్, ఆగ్రా, లక్నో, గోరఖ్‌పూర్, పాట్నాలో వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉంది. అదే గయ, ముజఫర్‌పూర్, అలహాబాద్‌లో ఒక మోస్తరులో వాయుకాలుష్యం నెలకొని ఉంది. వాయు కాలుష్యం ప్రభావం అక్టోబర్-నవంబర్, డిసెంబర్-్ఫబ్రవరి మధ్య ఎక్కువగా ఉంటుందన్నారు. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్రప్రభుత్వాలు నిర్దిష్టమైన ప్రణాళికలతో ముందుకు వచ్చి అమలు చేస్తే అకాల మృత్యువాతకు గురయ్యే శాతం తగ్గుతుందని సీడ్ ప్రొగ్రాం డైరెక్టర్ చెప్పారు. ప్రజల్లో కూడా వాయుకాలుష్యంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.