జాతీయ వార్తలు

పాక్‌కు గుణపాఠం తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 22: పాకిస్తాన్ తన బుద్ధి మార్చుకోకపోతే తగిన గుణపాఠం తప్పదని కేంద్ర హోమ్‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్రంగా హెచ్చరించారు. సరిహద్దులో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని పాక్‌పై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీఎఎస్‌ఎఫ్ 16వ వార్షిక వేడుకల్లో రాజ్‌నాథ్ మాట్లాడుతూ ‘పొరుగుదేశాలతో సత్సంబంధాలు, శాంతినే కోరుకుంటున్నాం. అయితే ఆ దేశం బుద్ధిమాత్రం మారడం లేదు’ అని పాక్‌ను ఉద్దేశించి పరోక్షంగా విమర్శించారు. పాక్ తీరు అలానే కొనసాగితే చూస్తు ఊరుకోమని సరైన గుణపాఠం చెబుతామని ఆయన హెచ్చరించారు. ‘మీ వైపు కాల్పులు జరిపితే దానికి ఎలాంటి బదులు ఇవ్వాలో, ఎలా తిప్పికొట్టాలో మీరే నిర్ణయించుకోండి’ అని బీఎస్‌ఎఫ్ జవాన్లను ఉద్దేశించి సింగ్ స్పష్టం చేశారు. అంతర్జాతీయ సరిహద్దులో గత కొద్ది రోజులుగా బీఎస్‌ఎఫ్ జవాన్లు చూపిన తెగువ, సమయస్పూర్తిని ఆయన ప్రస్తావించారు. పాకిస్తాన్ కవ్వింపు చర్యలు, కాల్పుల ఘటనలపై హోమ్‌మంత్రి తీవ్రంగానే స్పందించారు. ఇటీవల ఎల్‌ఓసి వెంబడి పాక్ జరిపిన కాల్పుల్లో ఇద్దరు బీఎస్‌ఎస్ జవాన్లతోపాటు ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ఓ చిన్నారి ఉంది. 18 మంది గాయపడ్డారు. అంతర్జాతీయ సరిహద్దు, ఎల్‌ఓసి వద్ద పాక్ ఫిరంగులతో తెగబడుతోంది. ఈ ఏడాది ఐదు నెలల్లోనే 700 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించింది. 39 మంది చనిపోగా అందులో 18 మంది భద్రతా సిబ్బందే. పాకిస్తాన్, బంగ్లాదేశ్ సరిహద్దులను మొత్తానికి మూసివేయాలన్న ఉద్దేశంతో మోదీ ప్రభుత్వం ఉందని హోమ్‌మంత్రి రాజ్‌నాథ్ వెల్లడించారు. టెక్నాలజీ గాడ్జెట్లు, స్మార్ట్ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పుడా పని పురోగతిలో ఉందని రాజ్‌నాథ్ అన్నారు. కొద్ది నెలల్లోనే పని పూర్తవుతుందని ఆయన చెప్పారు. ‘ఇరుగు పొరుగు దేశాలతో మనం మంచి సంబంధాలు కోరుకుంటున్నాం. ప్రపంచమంతా ఒకటే కుటుంబం అనే సిద్ధాంతం మనది’ అని ఆయన ఉద్ఘాటించారు. బీఎస్‌ఎఫ్ దేశానికి తొలి రక్షణ కవచంగా హోమ్‌మంత్రి అభివర్ణించారు. దేశ రక్షణ కోసం సాయుధ బలాగాలు చేస్తున్న త్యాగాలను జాతి ఎప్పటికీ మరువదని ఆయన స్పష్టం చేశారు.