రాష్ట్రీయం

కడవరకూ కష్టమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 22: కర్నాటకలో కాంగ్రెస్- జేడీ(ఎస్) ప్రభుత్వం కడవరకూ కొనసాగడం కష్టమేనని కేంద్ర మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి జోస్యం చెప్పారు. ‘స్వార్థంతో కూడిన వారి కలయిక ఎంతోకాలం సాగదు’ అని వ్యాఖ్యానించారు. కర్నాటక ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకున్నారని చెప్పడానికి రాష్ట్రంలో సాధించిన 104 స్థానాలే ఉదాహరణ అన్నారు. ‘వాళ్లది అపవిత్ర కలయిక. ఎంతోకాలం కలిసి ఉండలేరు’ అని ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి స్పష్టం చేశారు. అసోచామ్ కార్యక్రమానికి హాజరైన సాధ్వీ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ ‘వాళ్ల అపవిత్ర కలయిక కర్నాటక ప్రజల సంక్షేమం కోరి కాదని, వ్యక్తిగత కాంక్షతోనే’నని ఉద్ఘాటించారు. ‘జేడీ(ఎస్) గత చరిత్రను ఒక్కసారి పరికించండి. గతంలో జేడీ(ఎస్) తన భాగస్వామ్యపక్షాలను వదిలిపెట్టి పోయింది. ఇలా ప్రజలను ఎంతోకాలం మోసం చేయలేదు’ అని వ్యాఖ్యానించారు. జేడీ(ఎస్) నేత హెచ్‌డి కుమారస్వామి నేడు కర్నాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పెద్దఎత్తున నిర్వహించనున్న కార్యక్రమానికి పలువురు బీజేపీయేతర ముఖ్యమంత్రులు, పార్టీల అధినేతలు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ కార్యక్రమానికి హాజరవుతున్నారు. బీజేపీయేతర రాష్ట్రాల నుంచి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తెలంగాణ సీఎం కె చంద్రశేఖర్ రావు, ఆంధ్ర సీఎం చంద్రబాబులు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అలాగే సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, బీఎస్పీ సుప్రీం మాయావతిలు సైతం హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణ స్వీకారోత్సవం విపక్షాల ఐక్యతను తేటతెల్లంచేసే కార్యక్రమంగా కనిపిస్తోంది. దీనిపై సాధ్వీ స్పందిస్తూ బీజేపీయేతర నేతల ఐక్యత వ్యక్తిగత స్వార్థంకోసమే తప్ప, దేశ సంక్షేమాన్ని కాంక్షించి మాత్రం కాదని వ్యాఖ్యానించారు.