జాతీయ వార్తలు

అమెరికాతో సంబంధాలకు ఢోకా లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మే 22: రష్యా, చైనాలతో.. భారత్ నెరపుతున్న సంబంధాలు అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఏవిధమైన అడ్డంకి కాబోవని సీనియర్ బీజేపీ నాయకుడు రామ్ మాధవ్ అన్నారు. భారత్ అనుసరించే విదేశాంగ విధానం, ప్రతి దేశంతో స్వతంత్రంగా సంబంధాలు నెరపుకునే విధంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అందువల్ల అమెరికాతో నెరపే బలీయమైన సంబంధానికి ఎటువంటి ఢోకా ఉండబోదన్నారు. ‘ప్రాంతీయ రాజకీయాలు, చుట్టుపక్కల శక్తివంతమైన దేశాలతో సంబంధాలను తప్పనిసరి చేస్తాయి. ఇది యుఎస్‌కు కష్టం కలిగించవచ్చు. కానీ అవి మేం యుఎస్‌తో నెరపే సంబంధాలకు ఏవిధమైన అవరోధం కాబోవు’ అని రామ్‌మాధవ్ స్పష్టం చేశారు. రష్యాపై, అమెరికా విధించిన ఆంక్షల నేపథ్యంలో రామ్ మాధవ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. గత నెలలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తోను, నిన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తోను, ప్రధాని నరేంద్ర మోదీ జరిపిన లాంఛన చర్చలపై కొందరు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ, ‘ గత మూడు నాలుగేళ్లుగా, ఏదేశాన్ని పక్కన పెట్టే రీతిలో మా విదేశాంగ విధానం కొనసాగడం లేదు. అన్ని దేశాలతో సత్సంబంధాలు నెరపాలన్న లక్ష్యంతోనే మేం ముందుకు సాగుతున్నాం,’ అన్నారు. అంటే భారత్ ఒక దేశంతో అనుసరించే విధానం, మరో దేశంతో ఉండే సంబంధాలపై ఏవిధమైన ప్రభావం లేకుండా ‘స్వతంత్రంగా’ ఉంటుందని ఆయన వివరించారు. ఇటీవలనే ట్రంప్ ప్రభుత్వం ఒక చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ‘ది కౌంటరింగ్ అమెరికా ఆడ్వర్సిటీస్ త్రో శాంక్షన్స్ యాక్ట్’ (సీఏఏటీఎస్‌ఏ) పేరుతో ఉన్న ఈ చట్టం రష్యా, ఇరాన్, ఉత్తరకొరియాలపై ఆంక్షలు విధిస్తోంది. రష్యాతో రక్షణ, ఇంటెలిజెన్స్ రంగాల్లో సంబంధాలు పెట్టుకునే ఇతర దేశాలపై అనుబంధ ఆంక్షలు విధించేందుకు చట్టంలోని 231వ సెక్షన్ వీలు కల్పిస్తోంది. కాగా ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడుస్తున్న నేపథ్యంలో, విదేశాల్లోని బీజేపీ మిత్రులు నిర్వహించిన ‘న్యూ ఇండియా ఈవెంట్’లో రామ్‌మాధవ్ పాల్గొని ప్రసంగించారు.