జాతీయ వార్తలు

ఆరోపణలకు ప్రభుత్వం జవాబు చెప్పాల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 23: తిరుమల తిరుపతి దేవస్థానంలో చోటుచేసుకుంటున్న కుంభకోణాలపై ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు చేసిన ఆరోపణలకు ప్రభుత్వం జవాబు చెప్పాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలిసేందుకు బుధవారం కన్నా ఢిల్లీకి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడారు. రమణ దీక్షితులు చంద్రబాబు ప్రభుత్వంపై ఆభరణాల మాయం, ఆలయంలో రహస్య తవ్వకాలపై చేసిన ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించేందుకు ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. టీటీడీ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం నిజాయితీని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. టీటీడీ భక్తులందరికీ సంబంధించిందని, ప్రజలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని అన్నారు. టీటీడీ విషయంలో ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి భయపెడుతున్నారని, ఏపీలో పోలీసు రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు. స్వామివారికి కానుకగా ఇచ్చిన డైమండ్ మాయం కావడంపై ప్రభుత్వం రకరకాల వాదనలు వినిపిస్తోందని అన్నారు.
ప్రస్తుతం ఏర్పడిన అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని, సీబీఐ విచారణ జరిపించాలని కన్నా స్పష్టం చేశారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ నెల 26న నాలుగేళ్లు పూర్తి చేసుకుంటోందని, అదేరోజున ఏపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తానని తెలిపారు. రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేయమని అధ్యక్షుడు అమిత్ షా ఆదేశించినట్టు చెప్పారు. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసేందుకు వ్యూహాన్ని రూపొందించి పనిచేయాలని అమిత్ షా సూచించినట్టు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.