జాతీయ వార్తలు

మనది ఉమ్మడి సంస్కృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాంతినికేతన్, మే 25: భారత్-బంగ్లాదేశ్ బంధం స్వర్ణయుగంలోకి అడుగు పెట్టిందని, భూభాగం, తీర ప్రాంత సరిహద్దు వివాదాలు శాశ్వతంగా పరిష్కరించుకున్నామని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. విశ్వభారతి విశ్వవిద్యాలయంలో బంగ్లాదేశ్ భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఇరుదేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు బలోపేతమయ్యాయన్నారు. ఇరుదేశాల పూర్వచరిత్ర, సంస్కృతి ఒకటేనన్నారు. అనేక క్లిష్ట సమస్యలపై రెండు దేశాలు అవగాహనతో కూర్చుని పరిష్కరించుకోవడం నూతన శకానికి నాంది పలికినట్లయిందన్నారు. ఇరుదేశాలకు జాతీయ గీతాన్ని రాసిన గొప్ప కవి రవీంద్రనాథ్ టాగూర్ అని గుర్తు చేశారు. బంగ్లాదేశ్‌లోని కుషిటియా జిల్లాలోని కుతిబారిలోని రవీంద్రనాథ్ టాగూర్ నివాసాన్ని మరమ్మత్తు చేసే బాధ్యతను ఇరు దేశాలు స్వీకరించినట్లు చెప్పారు. కోల్‌కొత్తా నుంచి ఖులానా వరకు ఏసి రైలును కూడా నడుపుతున్నామన్నారు. దీనికి బంధన్ అని నామకరణం చేశామన్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌కు ఆరువందల మెగావాట్ల విద్యుత్‌ను
సరఫరా చేస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో 1100 మెగావాట్ల విద్యుత్‌ను సరఫరా చేస్తామన్నారు. బంగ్లాదేశ్ అంతరిక్ష పరిశోధన రంగంలో కొత్త పుంతలు తొక్కుతోందని ఆయన అభినందించార. ఇటీవల బంగ్లాదేశ్ రోదసీలోకి ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించడం గొప్ప పరిణామమన్నారు. కేంద్రం సహాయంతో విశ్వభారతి వర్శిటీ గ్రామాలను అభివృద్ధి చేయడాన్ని స్వాగతించారు. ప్రస్తుతం 50 గ్రామాలను అభివృద్ధి చేశారు. 2021నాటికి మరో 50 గ్రామాలను అభివృద్ధి చేయాలన్నారు. రవీంద్రనాథ్ టాగూర్ పెద్ద సోదరుడు సత్యేంద్రనాథ్ టాగూర్ సివిల్ సర్వీసుకు ఎంపికైన తొలి భారతీయుడని, ఆయనకు గుజరాత్‌లో తొలి పోస్టింగ్ ఇచ్చారని మోదీ పేర్కొన్నారు. 17 సంవత్సరాల వయస్సులో అహ్మదాబాద్‌లో రవీంద్రనాథ్ టాగూర్ ఆరు నెలలు ఉండి నవల, పద్యాలు రాశారన్నారు.
సంక్షోభంలో వెన్నంటి నిలిచారు: హసీనా
బంగ్లాదేశ్ అవతరించినప్పటి నుంచి ఎన్నో సంక్షోభాలను చవి చూసిందని, ప్రతి సమయంలో భారత్ తమకు అండగా నిలిచిందని బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా కృతజ్ఞతలు తెలిపారు. ఇరుదేశాలు పరస్పర సహకారంతో సరిహద్దు సమస్యలను పరిష్కరించుకున్నాయన్నారు. 1971 బంగ్లాదేశ్ విముక్తి సమయంలో భారత్ తమకు అందించిన సహాయాన్ని బంగ్లాదేశ్ పౌరులు ఎన్నటికీ మర్చిపోరన్నారు. ఇరుదేశాలు దారిద్య్ర నిర్మూలనకు అంకిత భావంతో పని చేస్తున్నాయన్నారు. 2041 నాటికి బంగ్లాదేశ్‌ను సోనార్ బంగ్లాగా అవతరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు. విశ్వభారతి విశ్వవిద్యాలయం నిర్మాణంలో, అభివృద్ధిలో తమను భాగస్వామ్యం చేయడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. రవీంద్రనాథ్ టాగూర్ భారత్-బంగ్లాదేశ్‌లకు చెందినవారని చెప్పారు. తమకు రవీంద్రనాథ్ టాగూర్ అంటే ఎనలేని గౌరవం, ఆరాధన భావం ఉన్నాయని,బెంగాలీ సాహిత్యంలో ఆయన చేసిన కృషి నిరుపమానమని ఆమె శ్లాఘించారు. ఈ కార్యక్రమంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, వైస్ చాన్సలర్ సబ్జూకోలి సేన్ పాల్గొన్నారు.