జాతీయ వార్తలు

జిఎస్‌టిపై మరో ముందడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉదయపూర్, ఫిబ్రవరి 18: దేశమంతటా ఒకేరకమైన వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) అమలు దిశగా ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. దీనిని అమలు చేయడం వల్ల రాష్ట్రాలకు వచ్చే రెవిన్యూ నష్టాన్ని భర్తీ చేయడానికి ఉద్దేశించిన చట్టాన్ని జిఎస్‌టి కౌన్సిల్ శనివారం ఆమోదించింది. దీని అమలుకు వీలుగా తీసుకురావలసిన అనుబంధ చట్టాల ఆమోదాన్ని తదుపరి సమావేశానికి వాయిదా వేసింది. సెంట్రల్ జిఎస్‌టి (సి-జిఎస్‌టి), ఇంటిగ్రేటెడ్ జిఎస్‌టి (ఐ-జిఎస్‌టి)కి సంబంధించిన ముసాయిదా చట్టాలను ఆమోదించడానికి జిఎస్‌టి కౌన్సిల్ మార్చి 4, 5 తేదీల్లో అంటే రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావడానికి కొద్ది రోజుల ముందు సమావేశమవుతుంది. ఈ సమావేశాల్లోనే ఈ చట్టాలకు ఆమోదం పొందాలని కేంద్రం భావిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర జిఎస్‌టి (ఎస్-జిఎస్‌టి) చట్టాన్ని కూడా ఆ సమావేశం ఆమోదిస్తుందని శనివారం జరిగిన జిఎస్‌టి కౌన్సిల్ సమావేశం అనంతరం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. ఈ చట్టాలు ఆమోదం పొందిన తర్వాత కౌన్సిల్ గతంలో ఆంగీకరించిన నాలుగు పన్ను శ్లాబ్‌లు 5, 12, 18, 28 శాతాల్లో వివిధ వస్తువులు, సేవలను సర్దుబాటు చేయడంద్వారా వాటికి పన్ను రేట్లను నిర్ణయించే పనిని చేపడుతుందని ఆయన చెప్పారు. జూలై 1నుంచి కొత్త పన్నుల విధానాన్ని అమలు చేయడానికి జిఎస్‌టి కౌన్సిల్ ఈ చట్టాలను ఆమోదిస్తుందని అందరూ భావించారని, కొన్ని క్లాజులకు సంబంధించి న్యాయపరమైన ఇబ్బందుల కారణంగా వాయిదా పడినట్లు జైట్లీ చెప్పారు. కాగా, జిఎస్‌టిని అమలు చేశాక తొలి ఐదేళ్లలో రాష్ట్రాలకు వచ్చే రెవిన్యూ నష్టాన్ని కేంద్రం భర్తీ చేయడానికి సంబంధించిన ఒక చట్టాన్ని కౌన్సిల్ ఆమోదించినట్లు తెలిపారు. మార్చి 9నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల్లో ఆమోదంకోసం పార్లమెంటు ముందుకు వెళ్తుందని ఆయన చెప్పారు.
మెట్టుదిగిన కేంద్రం
వస్తు సేవల పన్ను కింద పన్ను చెల్లింపుదారుల విభజనకు సంబంధించి కుదిరిన ఒప్పందంలో మార్పులు చేయడానికి వీలు కల్పించే గత జిఎస్‌టి కౌన్సిల్ సమావేశానికి చెందిన మూడు తీర్మానాలను కేంద్రం రికార్డులనుంచి తొలగించేలా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు చేయగలిగాయి. 1.5 కోట్లలోపు వార్షిక టర్నోవర్ లోపు టాక్స్ అసెసీల్లో 90 శాతం కేంద్రం, మిగతా పది శాతం రాష్ట్రాలు మదింపు చేయాలని గత నెల 16న జరిగిన జిఎస్‌టి కౌన్సిల్ సమావేశంలో అంగీకారం కుదిరింది. కాగా, 1.5 కోట్లకు పైబడిన వార్షిక టర్నోవర్ కలిగిన అసెసీల విషయంలో కేంద్రం, రాష్ట్రాల మధ్య ఈ నిష్పత్తి 50:50గా ఉంటుంది. అయితే ఈ రోజు సమావేశం ముందుకు ఈ అంశం ఆమోదం కోసం వచ్చేసరికి కేంద్రంతో చర్చించి రాష్ట్రాలు టాక్స్ అసెసీలను వేర్వేరు నిష్పత్తుల్లో విభజించడానికి వెసులుబాటు ఇచ్చేదిగా మారిపోయింది.ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, కేరళ, కర్నాటక లాంటి రాష్ట్రాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. దీంతో ఈ తీర్మానంతో పాటుగా మరో రెండు తీర్మానాలను కూడా గత సమావేశం మినిట్స్‌నుంచి తొలగించేందుకు కేంద్రం అంగీకరించింది.