రాష్ట్రీయం

గబ్బిలాలతో ‘నిఫా’ వట్టిదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 26: ఇప్పుడు దేశాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్న నిఫా వైరస్ గబ్బిలాల వల్ల సంక్రమిస్తుందనని ఎలాంటి నిరూపణ కాలేదని వైద్యనిపుణులు నిర్ధారించారు. ఈ వైరస్ సోకి కేరళలోని కోజికోడ్, మల్లాపురం జిల్లాల్లో ఇప్పటివరకు 12 మంది మృతి చెందారు. కాగా ఈ ప్రాంతాల్లో గబ్బిలాలు, ఇతర జంతువుల నుంచి సేకరించిన నమూనాలను పరీక్షించగా అది నెగిటివ్ అని వచ్చిందని, ఈ మేరకు సెంట్రల్ మెడికల్ టీమ్ కేంద్ర ఆరోగ్యశాఖకు నివేదిక పంపినట్టు అధికారులు తెలిపారు. వారి నివేదిక మేరకు గబ్బిలాలు, పందులు ఈ వ్యాధి వ్యాప్తికి ఎంతమాత్రం కారణం కాదని వెల్లడైందని చెప్పారు. దీంతో వైద్య బృందం ఈ వ్యాధి వ్యాప్తికి గల ఇతర కారణాలను అనే్వషిస్తోందన్నారు. ముఖ్యంగా ఈ బృందం 21 శాంపిల్స్ తీసుకుందని, ఏడు జాతుల గబ్బిలాలు, రెండు జాతుల పందులు, ఒక ఎద్దు, ఒక మేకకు సంబంధించిన నమూనాలను సేకరించి భోపాల్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హైసెక్యూరిటీ ఏనిమల్ డిసీజెస్, పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పరీక్షల నిమిత్తం పంపారు. ఈ వ్యాధితో మొదటి మృతి సంభవించిన కేరళలోని పెరంబరలోని ఇంటిలోని నూతిలోని గబ్బిలాల నుంచి రక్తం, ఇతర నమూనాలను సేకరించారు. ఆ నమూనాలను విశే్లషించగా నిఫా వైరస్ ‘నెగెటివ్’ వచ్చిందని అధికారులు తెలిపారు. అలాగే ఇటీవల ఈ వ్యాధి సోకిందని భావిస్తున్న వారి రక్తనమూనాలను విశే్లషించగా వారికి కూడా నెగెటివ్ వచ్చిందని, అనగా వారికి ఈ వ్యాధి లేదని నిర్ధారణ అయ్యిందని చెప్పారు. ఇంతవరకు ఈ వ్యాధికి సంబంధించి మొత్తం 15 కేసులు నమోదవ్వగా 12 మంది మృతి చెందారని, మిగిలిన ముగ్గురు చికిత్స పొందుతున్నారని తెలిపారు. అలాగే హైదరాబాద్‌లో ఇద్దరు నిఫా వ్యాధి అనుమానితుల శాంపిల్స్ కూడా నెగెటివ్ అని వచ్చిందన్నారు. ఈ వ్యాధి గురించి ప్రజలు భయాందోళన చెందవద్దని, ముఖ్యంగా వచ్చిన వ్యాధి ఎక్కువగా ఆ ప్రాంతానికే పరిమితం అవుతుందని అన్నారు. అయితే కొన్ని ఆరోగ్యకరమైన జాగ్రత్తలు పాటించాలని వారు సూచించారు.
ప్రస్తుతం ఈ వ్యాధి పరిస్థితిపై నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ డైరెక్టర్ ఆధ్వర్యంలో మల్టీ డిసిప్లినరీ కేంద్ర బృందం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. ఇప్పటివరకు ఈ వ్యాధి సోకిన వారు, వ్యాధి వల్ల మరణించిన వారు ప్రత్యక్షంగా, పరోక్షంగా మొదట వ్యాధితో మృతి చెందిన వారితో కాని, వారి కుటుంబ సభ్యులతో కాని సంబంధం వల్ల వ్యాప్తి చెంది ఉండవచ్చునని అభిప్రాయపడుతున్నారు. ముందు జాగ్రత్తగా కేంద్ర వైద్య బృందం కోజికోడ్, మల్లాపూర్‌లలో హైఅలర్ట్ ప్రకటించింది. ఈ వ్యాధి వ్యాపించకుండా జిల్లా ప్రవేశ, బయటకు వెళ్లే మార్గాల వద్ద అనుమానితులను పరీక్ష చేయడానికి ఏర్పాట్లు చేశారు. జునోసిస్ అనగా జంతు సంబంధ కారణాల వల్ల మనుషులు, జంతువులకు వ్యాపించే ఈ వ్యాధికి ఇంతవరకు వేక్సిన్ గాని, మందు కాని లేదు. వ్యాధి చికిత్సకు కేవలం దీనికి సపోర్టివ్ కేర్ మాత్రమే ఇస్తున్నారు. ఈ వ్యాధి అవి సోకిన జంతువులు, మనుషులకు దగ్గరగా మసలిన వారికి సోకడమే కాక, వారిద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది. అంతేకాకుండా గబ్బిలాలు కొరికిన పండ్లు, ఇతర పదార్థాలు, అవి వదలిన స్రావాలు కలిసిన ద్రవపదార్థాలు కాని, ఇతరమైనవి కాని తీసుకున్న వారికి ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉంది. తొలుత నిఫావైరస్‌ను 2001లో బెంగాల్‌లోని సిలిగురిలో, 2007లో నదియా జిల్లాలో కనుగొన్నారు. ఈ వ్యాధికి అప్పట్లో 47 మంది బలయ్యారు.