జాతీయ వార్తలు

సాధారణ స్థితికి తూత్తుకుడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తూత్తుకుడి, మే 26: హింసాత్మక సంఘటనలతో అట్టుడికిన తమిళనాడులోని తూత్తుకూడి ప్రాంతం ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి చేరుకుంటోంది. ఇక్కడ ఏర్పాటు చేసిన స్టెరిలైట్ యూనిట్‌ను తొలగించాలని జిల్లాలోని పలు గ్రామాల ప్రజలు పెద్దయెత్తున జరిపిన ఆందోళన హింసకు దారితీయగా పోలీసులు జరిపిన కాల్పుల్లో 13 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. మంగళవారం నుంచి అట్టుడికిన జిల్లాలో శనివారం ప్రశాంత పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వ బస్సులు యధాప్రకారం నడుస్తున్నాయి. ప్రజలకు నిత్యావసర వస్తువులు అందుబాటులోకి వచ్చాయి. నిలిపివేసిన ఇంటర్నెట్ సర్వీసుల పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు. అయితే పోలీసుల పహారా మాత్రం కొనసాగుతోంది. నిర్దేశించిన కొన్ని ప్రాంతాలలో డ్రోన్‌ల ద్వారా పరిస్థితిని పోలీస్ అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం జిల్లా కలెక్టర్ సందీప్ నందూరి విలేఖరులతో మాట్లాడుతూ వంద శాతం ప్రభుత్వ బస్సులు యధావిధిగా తిరుగుతున్నాయని, పాలు, కూరగాయలు, ఇతర నిత్యావసరాల అమ్మకాలు సాధారణంగానే సాగుతున్నాయని చెప్పారు. సాయంత్రానికి ప్రైవేట్ బస్సులు కూడా తిరుగుతాయని తెలిపారు. తమ సేవలు పునరుద్ధరించాలని బ్యాంకులు, పెట్రోలుబంక్‌ల వారిని కోరామన్నారు. త్వరలోనే ఇవి కూడా పూర్తిగా పనిచేస్తాయని చెప్పారు. ప్రస్తుతం నగరంలో 90 శాతం పరిస్థితి సాధారణంగానే ఉందని, ఒకటి రెండు రోజుల్లో వందశాతం పూర్తి అదుపులో ఉంటుందని అన్నారు. ఈ అల్లర్లపై విచారణకు నియమించిన జస్టిస్ అర్జున్ జగదీశన్ విచారణ కమిషన్ త్వరలోనే తన పని ప్రారంభిస్తుందని ఆయన తెలిపారు. ఇంటర్నెట్ సర్వీసుల పునరుద్ధరణపై మాట్లాడుతూ పొరుగు జిల్లాలైన కన్యాకుమారి, తిరునెల్‌వెల్లిలో ఈ సర్వీసులు శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చాయని, ఇక్కడ పునరుద్ధరణపై ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. తూత్తుకూడి అల్లర్లకు సంబంధించి ఇప్పటివరకు 145 మందిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్టు ఎస్పీ మురళీ రంభ తెలిపారు. అయితే ఇందులో అమాయకులను అరెస్ట్ చేశారన్న ఆరోపణలను ఆయన ఖండించారు. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిన వెంటనే ఇక్కడ నియమించిన పోలీస్ బలగాలను నెమ్మనెమ్మదిగా తగ్గిస్తామని ఆయన చెప్పారు. ఇలావుండగా, కాల్పుల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సు తిరునవుక్కరసర్ డిమాండ్ చేవారు. అలాగే ఆందోళనకారులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని ఆయన కోరారు.