జాతీయ వార్తలు

వెండితెరపై మహాభారతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోచి, ఏప్రిల్ 17: భారతీయ ఇతిహాసం మహాభారతాన్ని ప్రపంచ తెరకెక్కించే ప్రయత్నాలు మొదలయ్యాయి. వెయ్యి కోట్ల భారీ బడ్జెట్‌తో మహాభారత ఘట్టాన్ని తెరకెక్కించేందుకు యుఏఇలో ఉంటున్న భారతీయ వ్యాపారి బిఆర్ శెట్టి ముందుకొచ్చారు. భారత్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌గా నిర్మించనున్న చిత్రాన్ని తెరకెక్కించే దర్శకత్వ బాధ్యత ప్రఖ్యాత యాడ్ ఫిల్మ్‌మేకర్ విఎ శ్రీకుమార్ మీనన్‌కు దక్కింది. రెండు భాగాలుగా నిర్మించనున్న సినిమా షూటింగ్ 2018 సెప్టెంబర్‌లో ప్రారంభంకానుంది. రెండేళ్ల వ్యవధిలో నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసి 2020 నాటికి రెండు భాగాలుగా సినిమా విడుదల చేయాలన్న సంకల్పంతో చిత్రబృందం ఉంది. తొలి భాగాన్ని విడుదల చేసిన 90 రోజుల వ్యవధిలోనే మలి భాగాన్నీ థియేటర్లకు తెచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ‘ప్రపంచ భాష ఇంగ్లీష్, రాజభాష హిందీ, ప్రాంతీయ భాషలైన మలయాళం, కన్నడ, తమిళం, తెలుగులో చిత్రాన్ని షూట్ చేస్తాం. తదుపరి అన్ని భారతీయ, ప్రాధాన్యత కలిగిన విదేశీ భాషల్లోకి అనువదించే యోచన చేస్తున్నాం’ అని ప్రఖ్యాత సీరియల్ నిర్మాత బిఆర్ శెట్టి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భారతీయ, ప్రపంచ సినిమాలో దిగ్గజ నటులు, సాంకేతిక నిపుణులు, అకాడెమీ అవార్డు విజేతలను ప్రాజెక్టులో భాగం చేస్తున్నారు. ‘అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన కాస్టింగ్ డైరెక్టర్ ప్రపంచ దేశాల్లోని దిగ్గజ నటులతో ఇప్పటికే సంప్రదింపులు జరిపారు. అనేక దేశాల సినీ నటులు ప్రాజెక్టులో ప్రాధాన్యత కలిగిన పాత్రలు పోషిస్తారు. మహాభారతం సినిమాకు ఖండాతర ఖ్యాతి దక్కడం ఖాయం’ అని శెట్టి పేర్కొన్నారు. దశాబ్దాలుగా భారతీయ కళలు, సాంస్కృతిక సేవల్లో నిమగ్నమైన బిఆర్ శెట్టి ఈ ప్రాజెక్టుకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. భీష్ముడు, పాండవుల కోణం నుంచి మహాభారతాన్ని అక్షరీకరించిన జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత ఎంటి వాసుదేవన్ నాయర్ రచించిన ‘రండమూగం’ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. భారతీయ సినిమా చరిత్రలో ఎన్నో జాతీయ అవార్డులు సాధించిన ఈ రచయితే సినిమాకూ స్క్రీన్‌ప్లే సిద్ధం చేస్తున్నారు. మహాభారతంలోని అనేక ఘట్టాలను దశాబ్దాలుగా నాటకం రూపంలో ప్రదర్శిస్తూనే ఉన్నారు. మరోపక్క టెలివిజన్ చానెళ్లలో సీరియళ్ల రూపంలోనూ ప్రసారమైంది. అయితే, మహాభారతాన్ని భారీ స్థాయిలో సినిమాగా నిర్మించడమన్నది ఇదే మొదటిసారి.
‘ఇతిహాసాలను ప్రేక్షకులకు అందించటంలో భారత సినీ పరిశ్రమకు ఓ వైవిధ్యం ఉంది. దాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ, అంతర్జాతీయ ప్రమాణాలకు ఏమాత్రం తగ్గకుండా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతోనే చిత్రాన్ని నిర్మించనున్నాం’ అని ప్రాజెక్టు రూపకర్త, యుఎఇలోని ఎక్స్ఛేంజి అండ్ ఎన్‌ఎంసి హెల్త్‌కేర్ చైర్మన్ బిఆర్ శెట్టి పేర్కొన్నారు. ‘వంద భాషల్లోకి అనువాదం కానున్న మహాభారతం సినిమా ప్రపంచంలోని కోట్లాదిమందికి చేరుతుందని బలంగా నమ్ముతున్నా’ అని శెట్టి ప్రకటించారు. ‘ప్రపంచ ప్రేక్షకులకు మహాభారతం కథను సినిమాగా అందించాలన్న ఆలోచన రావడమే గొప్ప విషయం. ఈ ఆలోచన చేసిన శెట్టి ఆకాంక్ష నెరవేరాలని ఆశిస్తున్నా. అందుకు నావంతు కృషి చేస్తా’ అని రండమూగం రచయిత, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత ఎంటి వాసుదేవన్ నాయర్ పేర్కొన్నారు. మహాభారతం స్క్రిప్ట్‌మీద గత కొనే్నళ్లుగా అధ్యయనం చేస్తూ, సినిమాగా మలిచేందుకు కృషి చేస్తున్న దర్శకుడు శ్రీకుమార్ మీనన్ మాట్లాడుతూ ‘నిర్మాణ నాణ్యతలో, చిత్రీకరణలో తదుపరి ప్రమాణాలను అందుకుంటాం. కథను వివరించే విషయంలోనూ మా ప్రత్యేకతను చాటుకుంటాం’ అని తెలిపారు.

జిగిత్యాల బహిరంగ సభలో మాట్లాడుతున్న మంత్రి కెటిఆర్. సభకు భారీగా హాజరైన పార్టీశ్రేణులు, ప్రజలు