జాతీయ వార్తలు

మహాకూటమి... ప్రజల అభిమతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 13: బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లకు వ్యతిరేకంగా ‘మహా ఘట్‌బంధన్’ (మహాకూటమి) ఏర్పాటుకావాలన్నది ప్రజల అభిమతమని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. మహారాష్టల్రో రెండు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మహాకూటమి ఏర్పాటు కేవలం రాజకీయ పార్టీలకే పరిమితమైన అభిప్రాయం కాదన్నారు. ప్రధాని, బీజేపీలు రాజ్యాంగంపై ఇతర సంస్థలపై దాడికి పాల్పడుతున్నాయని ఆరోపించారు. అయితే మహాకూటమికి ఎవరు నాయకత్వం వహించాలని విలేకర్లు అడిగిన ప్రశ్నకు సమాధానం దాటవేసిన ఆయన, పెట్రోల్, డీజిల్ ధరలను
జీఎస్టీ పరిధిలోకి తీసుకొని రావాలని విపక్షాలు కోరుతున్నా మోదీ పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఆవిధంగా చేస్తే సామాన్యులకు ఎంతో ఊరట కలుగుతుందన్నారు. యుపీఎ హయాంలో బ్యారల్ ధర రూ.130 ఉన్నపుడు, ఎన్‌డీఏ హయాం లో బ్యారల్ ధర రూ.70కి పడిపోయినప్పుడూ దేశంలో పెట్రోలు ధర ఒకే ధరకు అమ్ముతున్నారని. మరి ఈ వసూలు చేస్తున్న అధిక మొత్తం ఎవరి జేబుల్లోకి వెళుతున్నదని ప్రశ్నించారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడం వల్ల కలికే ప్రయోజనాలు సామాన్యులకు అందడం లేదని ఆరోపించారు. ఈ డబ్బంతా కేవలం కొద్ది మంది ధనికుల జేబుల్లోకి పోతున్నదన్నారు. ‘గబ్బర్ సింగ్’ పన్ను (జీఎస్టీ)ను అమల్లోకి తెచ్చి దేశ వాణిజ్య రాజధాని ముంబయిని తీవ్రంగా దెబ్బతీశారని ఆరోపించారు. ఇక్కడి పరిశ్రమలవారు, వర్తకులు, వస్తప్రరిశ్రమవారిపై ఈ గబ్బర్ సింగ్ పన్ను వల్ల తీవ్ర ప్రతికూల ప్రభావం పడిందన్నారు. నోట్ల రద్దువల్ల దేశవ్యాప్తంగా చిన్న వ్యాపారులు తీవ్రంగా దెబ్బతిన్నారన్నారు. తాము వీరికి ద్దతుగా పోరాటం సాగిస్తామన్నారు. కాగా మంగళవారం సాయంత్రం బూత్ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నరేంద్ర మోదీ తాను ఎప్పుడూ దేశానికి ‘చౌకీదార్’గా చెప్పుకుంటారు. కానీ ఆయన ఏ కొద్దిమంది పారిశ్రామిక వేత్తలకు మాత్రమే చౌకీదార్‌గా వ్యవహరిస్తున్నారంటూ విమర్శించారు. అంతేకాదు బీజేపీ సీనియర్ నాయకులైన అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్.కె. అద్వానీ, జస్వంత్ సింగ్ వంటివారిని, వారి కుటుంబాలను వేధింపులకు గురిచేస్తున్నాంటూ ఆరోపించారు.

జనంతోనే మమేకం
విజయవాడ (కార్పొరేషన్), జూన్ 13: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏ రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకోదని, ప్రజల పక్షాన నిలిచి వారితోనే పొత్తు ఉంటుందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహరాల ఇన్‌చార్జి ఊమెన్ చాందీ పేర్కొన్నారు. ఆంధ్రాలో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తెస్తామన్నారు. పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేస్తామన్నారు. యూపీఏ ప్రభుత్వం పార్లమెంటులో ప్రకటించిన ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయడంలో ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. రాహుల్ గాంధీ ప్రధాని అయిన వెంటనే ఆంధ్రప్రదేశ్‌కు పూర్తి న్యాయం చేస్తారని ప్రకటించారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా నియమితులైన ఊమెన్‌చాందీ ఏఐసీసీ ఆదేశాల మేరకు రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం నగరానికి విచ్చేసి బుధవారం వరకూ వివిధ స్థాయిల నేతలు, అనుబంధ సంస్థల నేతలు, మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులతో ముఖాముఖిగా అంతర్గత సమావేశాలతోపాటు సమష్టి కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించి అభిప్రాయాలను సేకరించారు. కార్యకర్తల అభిప్రాయాలను పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లి తదుపరి కార్యాచరణ సిద్ధం
చేస్తామని తెలిపారు. బుధవారం మధ్యాహ్నం విజయవాడలోని ఏపీసీసీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకుచ్చి రాహుల్‌గాంధీని ప్రధానిగా చేయడమే లక్ష్యంగా కార్యాచరణ ప్రణాళికలు అమలుచేస్తామన్నారు. కేంద్ర స్థాయిలో లౌకిక, ప్రజాతంత్ర పార్టీలతో పొత్తు ఉంటుందని, రాష్ట్రంలో మాత్రం ఏ పార్టీతోను పొత్తు ఉండదని తెలిపారు. గత నాలుగేళ్ల నరేంద్ర మోదీ పాలనలో రాష్ట్ర ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు, ఎన్నికల హామీల ఆమలులో వైఫల్యాలతోపాటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి కలిగే ప్రయోజనాలను వివరిస్తామన్నారు. నానాటికీ పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలకు కళ్ళెం వేయలేని కేంద్రం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. యూపీఏ ప్రభుత్వంలో సబ్సిడీ, ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు వంటి చర్యలతో ధరలను నియంత్రించి సుమారు లక్ష కోట్ల వరకూ ప్రజలకు మేలుచేస్తే నేటి బీజేపీ ప్రభుత్వం ఆయా సబ్సిడీలను ఎత్తివేసేందుకు కుట్ర పన్నుతోందని విమర్శించారు. గత నాలుగేళ్లుగా ఎన్‌డీఏ భాగస్వామిగా బీజేపీతో చెట్టపట్టాలేసుకున్న తెలుగుదేశం పార్టీ నేడు ప్రజల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకత దృష్ణ్యా ఎన్‌డీఏ నుంచి బయటకు వచ్చింది కేవలం ప్రజల దృష్టిని మరల్చడానికేనన్నారు. పీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి మాట్లాడుతూ 11 సార్లు ఎమ్మెల్యేగాను, 2సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఊమెన్‌చాందీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈనెల 19న రాహుల్‌గాంధీ 48వ జన్మదినం రోజు నుంచే పార్టీని పటిష్ఠపరిచే చర్యలను ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈ సమావేశంలో ఎంపీ కేవీపీ రామచంద్రరావు, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, కొప్పుల రాజు, కొండ్రు మురళి, మాజీ కేంద్ర మంత్రులు పల్లంరాజు, జేడీ శీలం, పనబాక లక్ష్మి, కిల్లి కృపారాణి, చింతా మోహన్, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, సీ రామచంద్రయ్య, శైలజానాధ్, పీ బాలరాజు తోపాటు పీసీసీ, డీసీసీ, సీసీసీ అధ్యక్షులు, వివిధ విభాగాల చైర్మన్లు పాల్గొన్నారు.