జాతీయ వార్తలు

వ్యవసాయ విద్యకు దన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 13: ఉన్నత వ్యవసాయ విద్యాభివృద్ధికి, నాణ్యమైన మానవ వనరులను ఉత్పత్తి చేయడానికి వీలుగా ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) రూ.2,225.46 కోట్లు కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. 2020 నాటికల్లా ఈ నిధులను పూర్తిగా వినియోగించాలని నిర్దేశించింది. సమావేశానంతరం కేంద్ర తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ విలేకర్లతో మాట్లాడుతూ ‘అగ్రికల్చరల్ ఎడ్యుకేన్ డివిజన్ మరియు ఐసీఏఆర్ ఇన్‌స్టిట్యూట్‌లకోసం రూ.2,225,46 కోట్ల వ్యయంతో రూపొందించిన మూడేళ్ల (2017-2020) కార్యాచరణ ప్రణాళికకు కేబినెట్ ఆమోదం తెలిపింది’ అని వెల్లడించారు. విద్యార్థులు, ఫ్యాకల్టీల్లో వౌలిక వసతుల ఆధునికీకరణకు కూడా ఈ పథకం ప్రాధాన్యతనిస్తుంది. ఉన్నత వ్యవసాయ విద్యలో ప్రణాళిక, అభివృద్ధి, సమన్వయం, నాణ్యతలపై ఐసీఏఆర్
ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తుంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఉన్న 75 వ్యవసాయ విశ్వవిద్యాలయాల
భాగస్వామ్యంతో కలిసి పనిచేస్తుంది. వ్యవసాయ విశ్వవిద్యాలయాలు అభివృద్ధి చేసిన మానవ వనరులు, దేశ వ్యవసాయ దృశ్యాన్ని సమూలంగా మార్చివేయడంలో ప్రధాన పాత్ర పోషించాయి. నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ సంస్థ వ్యక్తులు, సంస్థల సామర్ధ్యాలను పెంచడానికి కృషి చేయగా, నేషనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టం, వ్యవసాయ పరిశోధన, విద్య, సాంకేతిక నిర్వహణ విషయంలో సమర్ధవంతమైన పనితీరు ప్రదర్శించింది. సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఉమెన్ ఇన్ అగ్రికల్చర్ సంస్థ వ్యవసాయ రంగలోని మహిళలకు సాధికారతకోసం కృషి చేస్తున్నది.