జాతీయ వార్తలు

బయ్యారం, కడప ఉక్కు హుళక్కే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో స్పష్టీకరణ
న్యూఢిల్లీ, జూన్ 13: తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో బయ్యారం, ఆంధ్రప్రదేశ్‌లోని కడపలో ఉక్కు కర్మాగారాలు ఏర్పాటు చేయటం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన ఒక పిటిషన్‌లో స్పష్టం చేసింది. విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు బయ్యారం, కడపలో ఉక్కు కర్మాగారాలను ఏర్పాటు చేయవలసి ఉన్నది. విభజన జరిగి నాలుగేళ్లు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఈ రెండుచోట్ల ఉక్కు కర్మాగారాలు ఏర్పాటు చేయలేదంటూ కాంగ్రెస్ ఎంఎల్‌సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వం ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. బయ్యారం, కడపలో ఉక్కు కర్మాగారాలు ఏర్పాటుకు గల సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని మాత్రమే విభజన చట్టంలో హామీ ఇచ్చాం తప్ప ఉక్కు కర్మాగారాలను ఏర్పాటు చేస్తామనే హామీ ఏదీ ఇవ్వలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అధ్యయనం ప్రకారం బయ్యారం, కడపలో ఉక్కు కర్మాగారాలను ఏర్పాటు చేసేందుకు ఎలాంటి అవకాశాలు లేవనేది స్పష్టమైందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
ఇప్పటికే తెలుగురాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతోందన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా బయ్యారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి కడప జిల్లాలో స్టీల్‌ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యం కాదని తేల్చిచెప్పడం తెలుగు రాష్ట్రాలకు ఆశనిపాతం వంటిదే. బయ్యారంలో ఉక్కుపరిశ్రమ ఏర్పాటు చేయాలని గత ఏడాది కేంద్ర ప్రభుత్వం టాస్క్ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసింది. అంతేగాకుండా ఈ ఏడాది జనవరి మాసంలో రాంచిలోని మెకాన్ సంస్థకు చెందిన కేంద్ర బృందం ఒకటి బయ్యారం గుట్టల్లో సర్వే నిర్వహించింది. ఉక్కుపరిశ్రమకు కావాల్సిన వౌలిక సదుపాయాల కోసం నీరు, రవాణా, స్థల సేకరణ వంటి కనీస సౌకర్యాలు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసింది. ఉక్కుపరిశ్రమ ఏర్పాటు కోసం దాదాపు 2వేల ఎకరాల స్థలం అవసరం ఉందని ఈ బృందం గుర్తించింది. టాస్క్ఫోర్స్ నివేదిక రాగానే ఆ నివేదిక ఆధారంగా బయ్యారంలో ఉక్కుపరిశ్రమ ఏర్పాటు చేస్తామని పరిశ్రమల శాఖమంత్రి బీరేంద్రసింగ్ స్పష్టంచేశారు. ఉక్కుపరిశ్రమ సాధ్యంకాని పక్షంలో కనీసం తుక్కు పరిశ్రమనైనా ఏర్పాటు చేస్తామని అప్పట్లో కేంద్రం ప్రకటించింది. టాస్క్ఫొర్స్ ఉక్కుపరిశ్రమపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసింది. ఎమటైట్ ఓర్ 10 మిలియన్ టన్నులు, మెగ్నటైట్ ఓర్ 400 టన్నులు బయ్యారం గుట్టలో ఉన్నట్లు టాస్క్ఫొర్స్ గుర్తించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తిమేరకు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా నిపుణులతో కూడిన టాస్క్ఫొర్స్ బృందం పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి బయ్యారంలో ఉక్కుపరిశ్రమ ఏర్పాటుకు సిఫారసు చేసింది. ఇక నేడో రేపో ఉక్కుపరిశ్రమపై కేంద్రం నుండి తీపికబురు వచ్చిందని అనుకుంటున్న తరుణంలో తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయం మహబూబాబాద్ జిల్లా వాసులను నిరాశకు గురిచేసింది. ఇప్పటికే బయ్యారంలో ఉక్కుపరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే. బయ్యారం ఉక్క్ఫ్యుక్టరీని ఎట్టిపరిస్థితుల్లో ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ శాఖమంత్రి కేటీఆర్ గత అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర నిర్ణయం తెలుగువారిని తీవ్ర నిరాశకు గురిచేసింది.