జాతీయ వార్తలు

బాబు వెన్నుపోటుకు పెట్టింది పేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 13: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అబద్ధాలకోరు, వెన్నుపోటుకు పెట్టింది పేరంటూ రాష్ట్ర బీజేపీ నాయకులు దుమ్మెత్తిపోశారు. రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, కేంద్ర మాజీ మంత్రి పురంధీశ్వరి, శాసనసభ్యుడు విష్ణుకుమార్ రాజు, లోక్‌సభ సభ్యుడు కంభంపాటి హరిబాబు తదితరులు బుధవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలిసి రాష్ట్ర రాజకీయాల గురించి చర్చించారు. విభజన హామీల అమలుపై చంద్రబాబు చేస్తున్న తప్పుడు ప్రచారం గురించి చర్చించటంతోపాటు, దీనిని తిప్పికొట్టేందుకు అనుసరించవలసిన వ్యూహంపై సమాలోచనలు జరిపారు. అనంతరం కన్నా లక్ష్మీనారాయణ, జీవీఎల్, పురందేశ్వరి విలేఖరులతో మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధిపట్ల బీజేపీ చిత్తశుద్ధితో వారు స్పష్టం చేశారు. చంద్రబాబు తన సహజ గుణంతోనే ఏన్డీయే నుంచి వెనక్కిపోయారని ప్రధానికి వివరించినట్టు కన్నా చెప్పారు. చంద్రబాబుకు వెన్నుపోటు పొడవడం అలవాటేనని చెప్పానని కన్నా వెల్లడించారు. అమరావతి శంకుస్థాపన సమయంలో చంద్రబాబే నీళ్లు, మట్టి తెమ్మని ప్రధాని మోదీని కోరారని ఆయన వెల్లడించారు. రాష్ట్రానికి ఏమీ ఇవ్వకుండా మోదీ నీళ్లు, మట్టి ఇచ్చారని ఇప్పుడు విష ప్రచారం చేయిస్తున్నారని దుయ్యబట్టారు. విభజన మూలంగా ఆంధ్రప్రదేశ్‌కు నష్టం జరిగిందని అమిత్ షా కూడా భావిస్తున్నారు.. అందుకే రాష్ట్రాన్ని ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నారని నరసింహారావు తెలిపారు. చంద్రబాబు కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తూ కాలయాపన చేస్తున్నా బీజేపీ మాత్రం రాష్ట్భ్రావృద్ధిపైనే దృష్టి సారిస్తుందని ఆయన తెలిపారు. పరిపాలనను పక్కన పెట్టి యాత్రల పేరుతో చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు.. రాష్ట్భ్రావృద్ధిని ఏమాత్రం పట్టించుకోవటం లేదని దుయ్యబట్టారు. చంద్రబాబు టీమ్ ప్రతి ప్రాజెక్టులో అవినీతికి పాల్పడుతోందని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దీనిని అడ్డుకున్నందుకే ఎన్‌డిఏ నుండి బైటికి వచ్చారని ఆయన చెప్పారు. ప్రత్యేక హోదా స్థానంలో ఇస్తున్న ప్యాకేజీ అమలు కాకపోవటానికి చంద్రబాబే ప్రధాన కారకుడని కన్నా ఆరోపించారు. విదేశీ సంస్థల నుండి తీసుకునే రుణాల ద్వారా ప్యాకేజీని అమలు చేసేందుకు అంగీకరించిన చంద్రబాబు 30 శాతం మొబిలైజేషన్ ఫండ్ ఇచ్చేందుకు అంగీకరించలేదన్నారు. స్వదేశీ సంస్థల ద్వారా ప్యాకేజీని అమలు చేయాలంటూ ముఖ్యమంత్రి మాట మార్చారు.. దీనికి కూడా కేంద్రం అంగీకరించిందన్నారు. ఎస్‌పీవీని ఏర్పాటు చేయాలని కేంద్రం అడగ్గానే చంద్రబాబు మళ్లీ మాటమార్చి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఇప్పుడు ఎస్‌పీవీ ఏర్పాటు చేసినా 16వేల కోట్ల రూపాయలు అందజేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నదని ఆయన చెప్పారు. చంద్రబాబు ఎస్‌పీవీని ఏర్పాటు చేయగలరా? అని ఆయన ప్రశ్నించారు. పది నెలల అనంతరం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండదని జీవీఎల్ జోస్యం చేప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాల కంటే స్వంత ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం బాధ కలిగిస్తోందని నరసింహారావు అన్నారు. తెలుగుదేశం చేస్తున్న అవినీతిని ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని అధికారం నుంచి దూరం చేస్తారని స్పష్టం చేశారు.