జాతీయ వార్తలు

ఏమిటీ కొత్త ప్రతిష్ఠంభన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 18: అరవింద్ కేజ్రీవాల్ నిరసన, బీజేపీ వైఖరి వల్ల ఢిల్లీ నగరంలో అన్ని కార్యకలాపాలు స్తంభించిపోయాయంటూ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ సంక్షోభాన్ని సరిగ్గా అంచనా వేయడం లేదంటూ ఆరోపించారు. ‘్ఢల్లీ ముఖ్యమంత్రి లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కార్యాలయంలో ధర్నాకు దిగారు. ఇక బీజేపీ ముఖ్యమంత్రి ఇంటి వద్ద ధర్నాకు దిగింది. ఢిల్లీ బ్యూరోక్రాట్లు ప్రెస్ కాన్ఫరెన్స్‌లు పెడుతున్నారు. ఈ ఆరాచకాన్ని చూసీ చూడకుండా ప్రధాని వ్యవహరిస్తున్నారు. వీటన్నింటివల్ల బాధలు పడుతున్నది ఢిల్లీ ప్రజలు మాత్రమే’ అని పేర్కొన్నారు.
ఐఏఎస్ అధికార్ల సమ్మెను విరమింప జేయాలని కోరుతూ కేజ్రీవాల్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కార్యాలయంలో సోమవారం కూడా ధర్నా కొనసాగించారు. ఈ నెల 13 నుంచి ఆయన తన మంత్రివర్గ సహచరులతో కలిసి అనీల్ బైజాల్ కార్యాలయంలో ధర్నా చేస్తున్నారు. ఇంటింటికీ రేషన్ పంపిణీకి అనుమతినివ్వాలని కూడా ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఇక బీజేపీ కూడా కేజ్రీవాల్ ధర్నాకు, ప్రతిగా నిరసనను సోమవారం కూడా కొనసాగించింది. ఇదిలావుండగా నిరాహర దీక్షలో ఉన్న ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా ఆరోగ్యం క్షీణించడంతో సోమవారం ఆసుపత్రికి తరలించారు. కాగా ఆదివారం సత్యేంద్ర జైన్ ఆసుపత్రిపాలయ్యారు. తన డిప్యూటీ ఆసుపత్రిపాలైన విషయాన్ని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.