జాతీయ వార్తలు

వారికి హిందూ ఓట్లే ముఖ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 18: హిందువుల ఓట్ల కోసం అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీలు పాకులాడుతున్నాయని ఎమ్‌ఐఎమ్ అధ్యక్షుడు ఒవైసీ అన్నారు. ఇటీవల జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి బీజేపీ ఒక్క ముస్లిం అభ్యర్థికి కూడా టికెట్ ఇవ్వలేదన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. అలాగే బీజేపీ తరపున లోక్‌సభలో ఒక్క ముస్లిం ఎంపీ కూడా లేకపోవడాన్ని బట్టి చూస్తే ముస్లింల రాజకీయ సాధికారత, అభివృద్ధి పట్ల బీజేపీకి ఏ విధమైన ఆసక్తి లేదన్న విషయం దీన్ని బట్టి స్పష్టమవుతోందని తెలిపారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ధోరణి కూడా ఇలాగే ఉందన్నారు. ఈ రెండు పార్టీలకు హిందువుల ఓట్లపైనే దృష్టి పడిందని, అసలు ముస్లిం ఓటు బ్యాంకు అన్నది లేనేలేదన్నది వాస్తవమని ఓవైసీ ఉద్ఘాటించారు. కానీ ఇప్పటి వరకూ ఇదే మాటతో ముస్లింలను ఈ రెండు పార్టీలు మోసం చేస్తూనే వచ్చాయని పునరుద్ఘాటించిన ఆయన ఇటీవల కేంద్ర మంత్రి ముఖ్తర్ అబ్బాస్ నఖ్వీ చేసిన ప్రకటనను ఉటంకించారు. దేశంలో ముస్లింల విశ్వాసాన్ని చూరగొనాలంటే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇంకా ఎంతో చేయాల్సి ఉంటుందన్న నఖ్వీ ప్రకటనపై ఒవైసీ స్పందించారు.