జాతీయ వార్తలు

కూలిన కాశ్మీర్ సర్కార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/శ్రీనగర్, జూన్ 19: జమ్ముకాశ్మీర్‌లో పీడీపీ, బీజేపీ మూడేళ్ల సంకీర్ణ ప్రభుత్వం పతనమైంది. రాష్ట్రంలో పేట్రేగిన ఉగ్రవాదం, క్షీణించిన శాంతిభద్రతలు, సంకీర్ణంలోని భాగస్వామ్య పార్టీల మధ్య ముదిరిన రాజకీయ వివాదాలతో పీడీపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు బీజేపీ ప్రకటించింది. జమ్ముకాశ్మీర్‌లో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాల నేపథ్యంలో గవర్నర్ పాలనకు రంగం సిద్ధమైంది. కాశ్మీర్‌లో గవర్నర్ పాలనకు సిఫార్సు చేస్తూ గవర్నర్ ఎన్‌ఎన్ వోహ్రా రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్‌కు నివేదిక పంపారు. అంతకుముందు అన్ని రాజకీయ పార్టీల నేతలతో మంతనాలు జరిపి కాశ్మీర్ రాజ్యాంగంలోని 92వ సెక్షన్ కింద ఈ సిఫార్సు చేశారు. ఏ క్షణమైనా గవర్నర్ పాలనను కేంద్రం విధించే అవకాశం ఉంది. అమర్‌నాథ్ యాత్ర తర్వాత జమ్ముకాశ్మీర్‌కు కొత్త గవర్నర్‌ను నియమించే ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తోంది. బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో, జమ్ముకాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆమె గవర్నర్ ఎన్‌ఎన్ వోహ్రాకు రాజీనామా లేఖను సమర్పించారు. కాశ్మీర్‌లో పీడీపీ భాగస్వామ్య ప్రభుత్వంలో ఉన్న బీజేపీ మంత్రులను ఢిల్లీకి పిలిపించి వారితో పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ మంతనాలు జరిపారు. అనంతరం ఆయన మంగళవారం మెహబూబా ముఫ్తీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ కాశ్మీర్ ప్రభుత్వంలో బీజేపీ ఇక ఏమాత్రం కొనసాగలేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ పరిణామాలపై మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ ముఖ్యమంత్రి పదవికి మెహబూబా రాజీనామా చేయడాన్ని ఆహ్వానించారు. 87 సీట్లున్న కాశ్మీర్ అసెంబ్లీలో గత ఎన్నికల్లో పీడీపీ 28 సీట్లలో, బీజేపీ 25 సీట్లలో నెగ్గింది. కాంగ్రెస్‌కు 15, నేషనల్ కాన్ఫరెన్స్‌కు 12 సీట్లు ఉన్నాయి. ఎన్నికలకు ముందు పీడీపీ, బీజేపీ పరస్పరం తీవ్ర పదజాలంతో విమర్శించుకున్నా, రెండు పార్టీలు కలిసి రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడడం, హింస నుంచి కాశ్మీర్‌కు విముక్తి కల్పించాలన్న లక్ష్యంతో ఉమ్మడి అజెండాను ఖరారు చేశాయి. రాష్ట్రంలో ఉగ్రవాదుల ఏరివేత, శాంతిభద్రతల పరిరక్షణ అంశాలపై సంకీర్ణంలోని పార్టీల మధ్య ఏకాభిప్రాయం కొరవడింది. కాగా ప్రభుత్వం ఏర్పాటుకు ఏ పార్టీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రసక్తిలేదని నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీలు ప్రకటించాయి. కాగా తాజా పరిణామాలను బేరీజు వేస్తే రాష్ట్రంలో గవర్నర్ పాలనకు బీజేపీ నాయకత్వం మొగ్గుచూపుతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి.
పీడీపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరణపై బీజేపీ అగ్రనేత రామ్ మాధవ్ మాట్లాడుతూ కాశ్మీర్‌లో తలెత్తిన పరిణామాలపై ప్రధాని మోదీతో సుదీర్ఘంగా చర్చించినట్లు చెప్పారు. కాశ్మీర్‌లో శాంతిభద్రతలు క్షీణించడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల రంజాన్ రోజు సీనియర్ జర్నలిస్టు సుజాత్ బుఖారిని ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు. అంతకు రెండురోజుల ముందు ఔరంగజేబు అనే జవానును మిలిటెంట్లు కిడ్నాప్ చేసి కాల్చి చంపారు. ఉగ్రవాదం పీచమణించేందుకు, తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వంనుంచి వైదొలగిందని రామ్ మాధవ్ చెప్పారు. ప్రజల ప్రాథమిక హక్కులను హరించే విధంగా ఉగ్రవాదులు పెట్రేగిపోయి హింసకు పాల్పడ్డారన్నారు. ప్రజల ప్రాథమిక హక్కులు ప్రమాదంలో పడ్డాయని, వీటి పరిరక్షణకు బీజేపీ కీలక నిర్ణయం తీసుకుందన్నారు. పీడీపి ఉద్దేశ్యాలతో తమ పార్టీకి అవసరం లేదని, వాటిని ప్రశ్నించడంలేదని, కాశ్మీర్‌లో శాంతి భద్రతల స్థాపన తమ ముఖ్యలక్ష్యమని రామ్ మాధవ్ చెప్పారు. శ్రీనగర్‌లో పీడీపి మంత్రి నరుూమ్ అక్తర్ మాట్లాడుతూ బీజేపి మద్దతు ఉపసంహరించుకోవాలన్న నిర్ణయం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. బీజేపి నేత, ఉప ముఖ్యమంత్రి కవీందర్ గుప్తా మాట్లాడుతూ, తమ పదవులకురాజీనామా లేఖలను గవర్నర్‌కు, ముఖ్యమంత్రికి సమర్పించామన్నారు. కాశ్మీర్ లోయ అభివృద్ధికి, శాంతి భద్రతల పరిరక్షణకు కేంద్రం చేసేదంత చేసిందన్నారు. పీడీపి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదన్నారు. దీని వల్ల మా పార్టీల నేతలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ మాట్లాడుతూ, బీజేపి లాంటి జాతీయ పార్టీ పీడీపి లాంటి ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకోరాదన్నారు. ప్రాంతీయ పార్టీలు తమకు తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితిని కల్పించాలన్నారు. ఇదిలా ఉండగా తాజా పరిణామాల నేపథ్యంలో కాశ్మీర్ పరిస్థితిని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమీక్షించారు.
రెండు నెలల తర్వాత కొత్త గవర్నర్
ఈ నెల 28వ తేదీన అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమవుతుంది. రెండు నెలలపాటు యాత్ర కొనసాగుతుంది. ఈ యాత్ర ముగిసిన తర్వాత ప్రస్తుత గవర్నర్ వోహ్రా స్థానంలో కొత్త గవర్నర్‌ను నియమించే అవకాశం ఉన్న బీజేపి నేతలు తెలిపారు. వోహ్రాను 2008లో నియమించి, 2013లో పదవీకాలాన్ని పొడిగించారు. అమర్‌నాథ్ యాత్రకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను కల్పించాల్సి ఉంది. ప్రతి రోజూ పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని, ఇటీవల కేంద్రం ఈ ఏర్పాట్లను సమీక్షించిందని బీజేపి వర్గాలు తెలిపాయి.