జాతీయ వార్తలు

లక్నో హోటళ్లలో అగ్ని ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, జూన్ 19: లక్నోలోని రెండు హోటళ్లలో అగ్నిప్రమాదం సంభవించి ఐదుగురు దుర్మరణం చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. లక్నో జంక్షన్‌కు అతి సమీపంలోని దూద్ మండి ప్రాంతంలో ఉన్న పక్కపక్కనే ఉన్న రెండు హోటళ్లలో ఈ ప్రమాదం సంభవించింది. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో హోటళ్లలో సిబ్బందితో సహా 60మంది ఉన్నారు. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా, మరో నలుగురు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పశ్చిమ ఎస్‌పి వికాస్‌చంద్ త్రిపాఠి వెల్లడించారు. 15 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపుచేశామని తెలిపారు. షార్ట్‌సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నామన్నారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరుపుతామని వెల్లడించారు. కాగా, ఈ దుర్ఘటనపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షల చొప్పున, గాయపడినవారికి 50వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ముఖ్యమంత్రి ప్రకటించారని అధికార ప్రతినిధి వెల్లడించారు. సంఘటనా స్థలాన్ని రాష్ట్ర మంత్రి రీటా బహుగుణ జోషి సందర్శించారు.