జాతీయ వార్తలు

ప్రిన్సిపాల్, పీటీని అరెస్టు చేయొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 19: యూపీ రాజధాని లక్నోలో పనె్నండో తరగతి విద్యార్థి ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రిన్సిపాల్, వ్యాయామ టీచర్ (పీటీ)కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. వారిద్దరినీ అరెస్టు చేయవద్దంటూ కోర్టు తాత్కాలిక ఉత్తర్వులు ఇచ్చింది. 2016 డిసెంబర్‌లో లలిత్ యాదవ్ అనే 12వ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లోనే తన తండ్రి లైసెన్స్‌డ్ పిస్తోల్‌తో కాల్చుకుని అతడు చనిపోయాడు. లక్నోలోని హజ్రత్‌గంజ్ కెథడ్రల్ సీనియర్ సెకండరీ స్కూలులో అతడు చదివేవాడు. ప్రిన్సిపాల్ మెల్విన్ సల్ధానా, పీటీ జేమ్స్ జాన్ విద్యార్థిని శారీరకంగా, మానసికంగా హింసించేవారని, అందువల్లే అతడు ఆత్మహత్యకు పాల్పడినట్టు అభియోగం. దీనిపై ప్రిన్సిపాల్, పీటీపై చార్జిషీట్ దాఖలైంది. తమపై దాఖలైన చార్జిషీట్‌ను సవాల్ చేస్తూ ప్రిన్సిపాల్, పీటీ అలహాబాద్ హైకోర్టులోని లక్నోబెంచ్‌లో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ధర్మాసనం వారి అభ్యర్థనను తోసిపుచ్చింది. దీంతో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. విద్యార్థి తండ్రి పోలీసు అధికారి కావడంతో దర్యాప్తు ఏకపక్షంగా సాగిందని వారు ఆరోపించారు. లలిత్ యాదవ్‌ను అవమానించడం కానీ కొట్టడం గానీ జరగలేదని వారు కోర్టుకు తెలిపారు. ప్రిన్సిపాల్ లేదా పీటీ నుంచి అతడికి ఎప్పుడూ వేధింపులు ఎదురుకాలేదని యాదవ్ స్నేహితుడు పోలీసులకు చెప్పాడు. కేసు కొట్టివేయాలని, చార్జిషీట్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు వెకేషన్ బెంచ్ న్యాయమూర్తులు ఎస్ అబ్దుల్ నజీర్, ఇందు మల్హోత్రా మంగళవారం విచారించారు. ప్రిన్సిపాల్, పీటీని అరెస్టు చేయవద్దంటూ తాత్కాలిక ఉత్తర్వులు ఇచ్చారు. విద్యార్థి పోస్టుమార్టం నివేదికలో కూడా అతడిని కొట్టినట్టు ఎక్కడా లేదని న్యాయవాదులు తెలిపారు. సంబంధిత నివేదికను ధర్మాసనానికి అందజేశారు. అలాగే యూపీ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు జారీ చేసింది.