జాతీయ వార్తలు

కశ్మీర్‌లో గవర్నర్ పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/శ్రీనగర్, జూన్ 20: జమ్ము-కశ్మీర్‌లో గవర్నర్ పాలన అమల్లోకి వచ్చింది. గత దశాబ్దకాలంలో జమ్ము-కశ్మీర్‌లో గవర్నర్ పాలన విధించడం ఇది నాలుగోసారి. బీజేపీ మద్దతు ఉపసంహరించుకున్న నేపథ్యంలో, పీడీపీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. జమ్ము-కశ్మీర్‌లో గవర్నర్ పాలన విధించక తప్పదన్న పలువురి అంచనాలు నిజమయ్యాయి. దీనిపై హోంశాఖ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ ‘జమ్ము-కశ్మీర్‌లో గవర్నర్ పాలన విధింపునకు రాష్టప్రతి ఆమోదించారు. ఇది తక్షణమే అమల్లోకి వస్తుంది’ అని వెల్లడించారు. నిజానికి మంగళవారం సాయంత్రం 6.30 గంటలకు రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ సూరీనామ్‌లో దిగాల్సి ఉంది. అక్కడ దిగిన వెంటనే గవర్నర్ ఎన్.ఎన్.వోరా పంపిన నివేదికను అందుకున్న రాష్టప్రతి పరిశీలించి తన ఆమోదాన్ని ఉదయం 6 గంటలకల్లా కేంద్ర హోం శాఖకు పంపారు. తక్షణమే గవర్నర్ పాలనకు సంబంధించిన విధివిధానాలను రూపొందించి శ్రీనగర్‌కు పంపారు. రాష్టప్రతి ఆమోదం లభించిన వెంటనే గవర్నర్, ‘జమ్ము-కశ్మీర్ రాజ్యాంగంలోని 92వ సెక్షన్ కింద రాష్ట్రంలో గవర్నర్ పాలన విధిస్తున్నట్టు’ ప్రకటించారు. వెంటనే ముఖ్య కార్యదర్శి బీబీ వ్యాస్‌తో తక్షణం చేపట్టాల్సిన సమస్యలపై చర్చించారు. ‘రాష్ట్ర పాలనా యంత్రాంగం మరింత వేగంగా, సమర్థవంతంగా, జవాబుదారీతనంతో పనిచేసేందుకోసం పౌర, పోలీసు, అటవీ ఇతర ప్రభుత్వ శాఖల అధికార్లతో గవర్నర్ చర్చలు జరిపారు. దీని తర్వాత రాష్ట్రంలో భద్రతపై సమీక్షిస్తారు’ అని రాజ్‌భవన్ ప్రతినిధి ఒకరు తెలిపారు. గత నాలుగు దశాబ్దాల కాలంలో రాష్ట్రంలో గవర్నర్ పాలన విధించడం ఇది ఎనిమిదోసారి. 2008 నుంచి వోహ్రా గవర్నర్ పదవి చేపట్టిన తర్వాత గవర్నర్ పాలన విధించడం ఇది నాలుగోసారి. సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్టు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీలో ప్రకటించారు. భద్రత విషయంలో ప్రభుత్వ వైఫల్యం నేపథ్యంలోనే తాము సంకీర్ణ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చినట్టు ఆయన స్పష్టం చేశారు.