జాతీయ వార్తలు

నేడే యోగా డే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: నాల్గవ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి దేశ వ్యాప్తంగా యోగా సంస్థలు విస్తృత ఏర్పాట్లుచేశాయి. జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించిన విషయం విదితమే. యోగా అంటే ప్రధాని నరేంద్ర మోదీ గుర్తుకు వస్తారు. ఆయన గురువారం డెహ్రాడూన్‌లో 55 వేల మంది ప్రజల సమక్షంలో జరిగే యోగా కార్యక్రమంలో పాల్గొంటారు. దేశ వ్యాప్తంగా వివిధ నగరాలు, పట్టణాల్లో ఐదువేలకు పైగా యోగా కార్యక్రమాలు జరుగుతున్నాయని కేంద్ర వైద్య శాఖ అధికార వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆసక్తికరమైన ట్వీట్‌చేస్తూ ‘ఆరోగ్యానికి పాస్‌పోర్టు యోగా’ అని పేర్కొన్నారు. యోగ అంటే కేవలం వ్యాయామాలు కావని, శరీరంలో పటుత్వం పెంచేందుకు, ఫిట్‌నెస్‌గా ఉంచేందుకు యోగా ఉపయోగపడుతుందన్నారు. యోగా నాకు ఒక ప్రయాణం అని మోదీ పేర్కొన్నారు. ‘యోగా సమతుల్యతను పరిరక్షిస్తుంది. నిశ్శబ్దాన్ని కల్పిస్తుంది. ఏకాగ్రతను పెంచుతుంది. అంతులేని బలాన్ని ఇస్తుంది’ అని మోదీ ట్వీట్‌లో తెలిపారు. జీవితంలో యోగా భాగం కావాలని మోదీ ప్రపంచ దేశాల ప్రజలను కోరారు. దేశ రాజధాని నుంచి ఒక మాదిరి పట్టణాల వరకు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించనున్నాయి. ఒక్క ఢిల్లీలోనే ఎనిమిది కార్యక్రమాలు నిర్వహించనున్నారు. లోథీ గార్డెన్, నెహ్రూ పార్కు, తల్కాటోరా గార్డెన్, రాజ్‌పథ్‌లో యోగా ఉత్సవాలను నిర్వహించేందుకు న్యూఢిల్లీ నగర పాలక సంస్థ విస్తృత చర్యలు తీసుకుంది. ఎర్రకోట వద్ద బ్రహ్మకుమారీలు భారీ ఎత్తున యోగా ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. దీనికి వివిధ సాయుధ బలగాలకు చెందిన 50 వేల మంది హాజరవుతున్నారు. ద్వారకలోని పతంజలి యోగా సమితి యోగా కార్యక్రమాల నిర్వహణకు సన్నాహాలను పూర్తి చేసింది. కేంద్ర మహిళా శిశుసంక్షేమ శాఖ క్విజ్ పోటీలను కూడా నిర్వహించింది. ఆయుష్ శాఖ యోగా లొకేటర్ పేరుపై ఒక యాప్‌ను కూడా రూపొందించింది. 150 దేశాల్లో యోగా కార్యక్రమాలను జరుగుతున్నట్లు కేంద్రం తెలిపింది. కాగా డెహ్రాడూన్‌లో అటవీ రీసెర్చి ఇనిస్టిట్యూట్‌లో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగం వినేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలిరానున్నారు. భద్రత ఏర్పాట్లను చేశారు.
మతప్రచారానికి వాడుకోవద్దు: ముస్లిం సంస్థలు
ఇలావుండగా యోగాను రాజకీయాస్త్రంగా వినియోగించుకోరాదని ముస్లిం సంస్థలు కేంద్రాన్ని కోరాయి. యోగాను మతపరంగా బందీని చేయరాదని, దీనిని ఒక శారీరక వ్యాయామంలో భాగంగా చూడాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రతినిధి సజ్జద్ నొమానీ తెలిపారు. ఇస్లాం కూడా ఆరోగ్యం, వ్యాయామాలకు ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. యోగా వ్యాయామం మంచిదన్నారు. కాని యోగాను మతపరమైన ప్రచారానికి వినియోగించుకోవడం పెరిగిందని, ఇది దురదృష్టకరమైన పరిణామమన్నారు. ప్రతి పౌరుడు మతాలకు అతీతంగా ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు యోగా చేయాలని ఆయన కోరారు. కాని యోగాను బలవంతంగా రుద్దరాదన్నారు. యోగా అంతర్జాతీయ వేడుకల్లో అందరూ పాల్గొనవచ్చని, కాని ఒత్తిడి చేయరాదన్నారు. ఆల్ ఇండియా షియా పర్సనల్ లా బోర్డు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. మతపరమైన ప్రచారానికి యోగాను వాడుకోరాదన్నారు. అనేక ఇస్లాం దేశాలు కూడా యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయని ఆ సంస్థ ప్రతినిధి యాసూబ్ అబ్బాస్ తెలిపారు.