జాతీయ వార్తలు

త్వరలో వాజపేయి డిశ్చార్జి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 21: బీజేపీ అగ్రనేత, మాజీ ప్రధాని ఏబీ వాజపేయి ఎయిమ్స్ నుంచి త్వరలోనే డిశ్జార్జి కానున్నారు. కార్డియోథొసాసిక్ ఐసీయూ విభాగంలో ఉంచి ఆయనకు వైద్య సేవలు అందిస్తున్నారు. వాజపేయి ఆరోగ్య పరిస్థితి మెరుగవుతోందని, త్వరలోనే డిశ్చార్జి చేయనున్నట్టు ఎయిమ్స్ అధికారులు గురువారం ఇక్కడ వెల్లడించారు. వాజపేయి ఆరోగ్యం క్రమంగా మెరుగవుతోందని, వైద్యానికి ఆయన స్పందిస్తున్నారని వైద్యులు తెలిపారు. కిడ్నీ ఇన్‌ఫెక్షన్, శ్వాస సంబంధిత సమస్యలతో ఈనెల 11న ఆయన ఎయిమ్స్‌లో చేరారు. బీజేపీ అగ్రనేతను ఐసీయూలో ఉంచి ప్రత్యేక వైద్య బృందం సేవలందిస్తోంది. వాజపేయికి డయాబెటిక్ ఉంది. 2009లో ఓ సారి గుండెపోటు వచ్చింది. అప్పటి నుంచి ఆయన బలహీనపడుతూ వచ్చారు.