జాతీయ వార్తలు

మాటలు తగ్గి... ఒంటరితనం పెరిగి...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్యాంకాక్, జూన్ 23: మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ వినియోగం పెరుగుతూ, సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ బిజీగా ఉండడంతో, మనుషుల మధ్య అంతరాయం పెరుగుతున్నదని, ఆత్మీయత, అనురాగం అనే మాటలకు అర్థం లేకుండా పోతున్నదని బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఇఫా’ అవార్డుల ప్రదానోత్సవానికి హాజరైన ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఒంటరితనం మనుషులను కుంగతీస్తుందని అన్నారు. మెదడును తొలిచేసి, తీవ్ర ప్రభావం చూపే ఒంటరితనం ఆరోగ్యకరమైనది కాదని స్పష్టం చేశారు. ‘మేము చిన్న ఇంట్లో ఉండేవాళ్లం. అటూఇటూ తిరుగుతున్నప్పుడు, పిల్లలం ఒకరినొకరు ఢీకొనేవాళ్లం. ఆ విధంగా మరొకరితో ఢీకొన్ని ప్రతిసారీ వారిని హత్తుకోవాలని మా తాత చెప్తుండేవారు. ఆ రకంగా కుంటుంబలోని వ్యక్తుల మధ్య ఆప్యాయత, అనురాగం పెరిగేవి. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. పిల్లలు ఎవరికివారే కూర్చొని, మొబైల్ ఫోనే లోకంగా కాలం గడిపేస్తున్నారు. ఇది బాధాకరమైన విషయం’ అన్నారు. ప్రకృతి అందాలను కూడా కళ్లతో చూడకుండా, వాట్సాప్ లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో డౌన్‌లోడ్ చేసుకొని చూడాల్సి వస్తున్నదని వ్యాఖ్యానించారు. ఫేస్‌బుక్ పెట్టిన తమ ఫొటోకు ఎక్కువ లైక్స్ రాకపోతే యువతీయువకులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, ఇది అత్యంత దారుణమని అనుపమ్ ఖేర్ అన్నారు. పది మందిలోకి వచ్చి, అనుభవాలు పంచుకుంటేనే ఒత్తిడి, మానసిక సంక్షోభం తగ్గుతాయని యువతకు ఆయన సూచించారు. తీవ్రమైన మానసిక ఒత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకుంటున్న యువతీయువకుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. ఒంటరితనాన్ని విడనాడి, కుటుంబంతోపాటు సమాజంలోని అందిరితో కలిసి ఉంటే, చాలావరకు మానసిక ఒత్తిళ్లకు, సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అన్నారు.