జాతీయ వార్తలు

అత్యాచారానికి మరణ శిక్షే సరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోపాల్, జూలై 11: బాలికలపై అత్యాచారానికి పాల్పడే కామంధులకు మరణ శిక్ష విధించే విధంగా చట్టాన్ని తేనున్నట్లుల ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. రాష్ట్రంలో ఇటీవల కాలంలో మైనర్లపైన దాడులు అత్యాచారాలు ఘటనలు పెరగడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఆయన ఉన్నతాధికారులతో సమీక్షించారు. తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం ఘటనలో నిందితుడికి మరణ శిక్ష పడిందని, ఈ కేసు విచారణ 46 రోజుల్లో పూర్తికావడంపై పోలీసులను అభినందించారు. మైనర్ బాలికలపై రేప్ ఘటనలపై పాల్పడిన వారికి మరణశిక్ష విధించేటట్లు చట్టాలకు సవరణ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ ఘటన మే 21వ తేదీన జరిగిందని, సాగర్ జిల్లాకు చెందిన 40 ఏళ్ల నిందితుడికి కోర్టు సత్వరమే విచారించి మరణ శిక్ష విధించిందన్నారు. ఇకపై ప్రతి 15 రోజులకోసారి శాంతి భద్రతల అంశాన్ని సమీక్షిస్తానన్నారు. మందాసౌర్ జిల్లాలో ఎనిమిదేళ్ల బాలికపై గ్యాంగ్ రేప్‌కు ప్రయత్నించిన ఘటనకు నిరసనగా ప్రజలు చేపట్టిన ఆందోళనను ఆయన ప్రస్తావించారు. బాధితురాలికి శరీరమంతా గాయాలయ్యాయి. ఆ బాలికకు ఇండోర్‌లోని మహారాజా యశ్వంతరాయ్ ఆసుప్రతిలో చికిత్స అందిస్తున్నారు.

మ్యూజియంకు చిల్లాల్ గోళ్లు!
న్యూయార్క్, జూలై 11: అరవై ఆరేళ్లపాటు చేతి గోళ్లను పెంచి గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించిన శ్రీ్ధర్ చిల్లాల్ ఎట్టకేలకు తన గోర్లను కత్తిరించుకోబోతున్నాడు. అత్యంత పొడవైన చేతి గోర్లు కలిగిన వ్యక్తిగా చిల్లాల్ 2016లో గిన్నిస్‌లో స్థానం సంపాదించాడు. అతని ఎడమచేతి గోర్ల మొత్తం పొడవు 909.6 మీటర్లు. ఒక్క బొటనవేలి గోరు పొడవే 197.8 మీటర్లు. పూణెకు చెందిన చిల్లాల్ 1952 నుంచి ఎడమ చేతి గోళ్లను పెంచడం ప్రారంభించాడు. ఇప్పుడు అతనికి 82 సంవత్సరాలు. అయితే చిల్లాల్ ఇప్పుడు తన చేతి గోళ్లను కత్తిరించుకునేందుకు సిద్ధపడ్డాడు. అందుకు కారణం- వాటిని భద్రపరచి మ్యూజియంలో సందర్శనకు ఉంచేందుకు టైమ్ స్క్వేర్‌లోని ‘రిప్లేస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్’ సంస్థ ముందుకు వచ్చింది. ‘గోళ్లు కత్తిరించే’ కార్యక్రమానికి పెద్దఎత్తున ఏర్పాట్లు కూడా చేసింది.