జాతీయ వార్తలు

తెలుగుపై ఇదేనా చిత్తశుద్ధి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 11: విద్యా సంవత్సరం ప్రారంభమైన తరువాత తెలుగు భాషాభివృద్ధికి నడుం బిగిస్తే లాభమేమిటని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఎపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. భాషకు ప్రాధాన్యత పెంచే దిశగా తెలుగుదేశం ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ కార్యదర్శి ప్రకటన చూసి ఆశ్చర్యం వేసిందని ఆయన ఎద్దేవా చేశారు. తెలుగు భాషాభివృద్ధి, అమలును పర్యవేక్షించేందుకు ఒక ప్రాధికార సంస్థను ఏర్పాటు చేసి దీనిద్వారా ఐదు కమిటీలు వేస్తామంటూ ప్రభుత్వం చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉన్నదని లక్ష్మీప్రసాద్ విమర్శించారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన తరువాత ప్రాధికారిత కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటిస్తే ఏం లాభం ఉంటుందని ఆయన ప్రశ్నించారు. ప్రాధికార సంస్థను ఎప్పుడు ప్రారంభిస్తారనేది ప్రకటించక పోవటం దురదృష్టకరమని అన్నారు. ఎన్నికల సంవత్సరంలో ప్రాధికార సంస్థ, కమిటీలను ఏర్పాటు చేయటం, పర్యవేక్షించటం, జరిమానాలు విధించటం సాధ్యమవుతుందా? అని తెలుగుదేశం ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు భాష దుస్థితి పట్ల ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేయటంతో ప్రభుత్వం కంటితుడుపు చర్యగా ఈ అరకొర చర్యల్ని తీసుకున్నట్లు స్పష్టమవుతోందని యార్లగడ్డ విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రాథమిక స్థాయి నుండి ఇంటర్ స్థాయి వరకు తెలుగులో బోధనను అమలు చేసే అంశాన్ని పూర్తిగా మరిచిపోయిందని, ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ నుండి పాఠాలు నేర్చుకోవాలని చురకలంటించారు. ప్రాథమిక స్థాయి నుండి తెలుగు భాషా బోధన జరిగితే తప్ప పిల్లలకు తెలుగులో చదవటం, రాయటం అబ్బదని స్పష్టం చేశారు. తెలుగు భాష అమలుపట్ల అంకితభావంతో పనిచేసినప్పుడే అమ్మభాషకు తగిన గౌరవం లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.