జాతీయ వార్తలు

రైతులంటే వారికి ఓటుబ్యాంకే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాలౌట్ (పంజాబ్), జూలై 11: దశాబ్దాలపాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం తమ స్వార్థ ప్రయోజనాల కోసం రైతులను కేవలం ఓటు బ్యాంకుగానే ఉపయోగించుకుందని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా విమర్శించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రైతులకు కనీస మద్దతు ధరను పెంచిన తర్వాత ‘కిసాన్ కల్యాణ్’ ర్యాలీ పేరుతో పంజాబ్‌లో మొదటిసారిగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ గత కొన్ని దశాబ్దాలుగా రైతులు ప్రశాంతంగా జీవించలేదని దీనికి ప్రధాన కారణం కాంగ్రెస్ విధానాలేనని అన్నారు. కాంగ్రెస్‌కు ఏదైనా బాధ ఉందంటే అది కేవలం వారి కుటుంబం గురించి మాత్రమేనని ఆయన విమర్శించారు. చాలా ఏళ్లుగా రైతులు కేవలం తమ ఉత్పత్తులపై కేవలం పదిశాతం లాభం మాత్రమే పొందుతున్నారంటే దానికి కారణమెవరో అందరికీ తెలుసని అన్నారు. రైతులు మన దేశానికి ఆత్మలాంటి వారని, వారు మనకు అన్నదాతలని, అయితే కాంగ్రెస్ మాత్రం వారి సంక్షేమాన్ని ఎప్పుడూ విస్మరించిందని, వారికి అబద్ధాలు చెబుతూ మభ్యపెడుతూ వచ్చిందని అన్నారు. వారిని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకుందన్నారు. అయితే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారిందని మోదీ అన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా వ్యవసాయ ఉత్పత్తులు పరిమాణం పెరిగిందన్నారు. వరి, గోధుమ, పత్తి, చక్కెరర్, ఇతర ఆహార ధాన్యాల మద్దతు ధరలు పెరిగాయన్నారు. ఇప్పుడు వ్యవసాయంలో కొత్త రికార్డులు సృష్టిస్తామని ఆయన చెప్పారు. ‘రైతు సోదర, సోదరీమణులారా పరిస్థితులు ఎలా ఉన్నా మీరు మాత్రం కష్టపడండి, మీకు సంతోషకరమైన జీవితం ఉంటుందని హామీ ఇస్తున్నాను’ అని మోదీ చెప్పారు. గత 70ఏళ్లుగా రైతులకు తగిన గౌరవం లభించలేదని, సమాజంలో వారు గౌరవంగా జీవించే పరిస్థితులు కల్పించలేదని ఆయన విమర్శించారు. ఆయా ప్రభుత్వాలు కేవలం వాగ్దానాలతోనే కాలం గడిపించదన్నారు. చరిత్ర ఈ విషయాన్ని చెబుతోందన్నారు. రైతుల సంక్షేమానికి పాటుపడుతున్నట్టు గత ప్రభుత్వం అనేక హామీలైతే గుప్పించింది కాని, తమ కుటుంబ సంక్షేమాన్ని మాత్రమే కాంగ్రెస్ చూసుకుందని అన్నారు. యావత్ జాతికంతటికీ ఈ నిజం తెలుసన్నారు. తొలుత పంజాబీలో కొన్ని మాటలు మాట్లాడిన ప్రధాని మోదీ పెద్దయెత్తున ఆహార పంటలను పండించి దేశానికి ఆహారభద్రత కల్పించడంలో పంజాబ్ రాష్ట్రం మిగిలిన దేశాలకు స్ఫూర్తినిస్తోందని ప్రశంసించారు. ఈ సభలో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్‌సంగ్ బాదల్, ఎస్.ఎ.డి చీఫ్ సుఖ్‌బీర్ సింగ్ బాదల్, కేంద్ర మంత్రి హర్షిమ్త్ కౌర్ బాదల్ తదితరులు పాల్గొన్నారు.