జాతీయ వార్తలు

దేశసేవలో నిమగ్నంకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై: దేశానికి సరైన దిశా గమనాన్ని నిర్దేశించ బలమైన వేదిక ఏర్పాటు చేసుకుని, కీలక బాధ్యతలు నిర్వర్తించే సివిల్ సర్వెంట్లు వృద్ధి రేటు పెరిగేలా కృషి చేయాలని రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ పిలుపునిచ్చారు. ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్, టెలికమ్యూనికేషన్స్, పోస్టల్ మరియు టెలిగ్రాఫ్, బిల్డింగ్ వర్క్స్ సర్వీసులకు చెందిన ట్రెయినీ అధికారులతో రాష్టప్రతి భవన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అధికారులకు రాష్టప్రతి హితోపదేశం చేస్తూ ‘దేశానికి సేవ చేయడానికి వీలుగా మీరెంచుకున్న విభాగాలు ఇప్పటికే బలమైన వేదిక ఏర్పాటుచేసి పెట్టాయి. మీరు చేయాల్సిందల్లా ఆ వేదికల నుంచి కీలక రంగాలను వృద్ధిపథంలోకి తీసుకెళ్లండి. అందుకు మీరే బాధ్యులు’ అని కోవింద్ స్పష్టం చేశారు. ‘ఒక కార్యాలయంలో ఏపనైనా చేసే అవకాశాల్ని కొన్ని ఉద్యోగాలు కల్పిస్తాయి. నిజానికి అది ఉద్యోగం కాదు, దేశానికి చేసే సేవ’ అని రాష్టప్రతి అన్నారు. ‘వృద్ధిరేటు గణనీయ పెరుగుదలకు టెలికమ్యూనికేషన్ రంగమే ఉదాహరణ. ఖతాదారులపరంగా చూస్తే, భారత్‌కు ప్రపంచంలోనే అత్యంత విస్తృత టెలికాం నెట్‌వర్క్ ఉందన్న విషయం అర్థమవుతుంది. ప్రగతి రేటు పెరుగుదలకు టెలికాం ఒక ఉదాహరణ అని, ముఖ్యంగా వైర్‌లెస్ కమ్యూనికేషన్స్ వృద్ధిలో భారత్ శరవేగంగా ముందుకెళ్తోందన్నారు. ఇదేవిధంగా విద్యుత్, రోడ్లు, జలవనరులు వృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సామాజిక, ఆర్థిక ప్రగతికి ఇవే మూలసాధనాలన్నారు. డిఫెన్స్ ఎస్టేట్ ఆఫీసర్లతో మాట్లాడుతూ దేశంలో పెరుగుతున్న పట్టణీకరణ వాస్తవాన్ని గ్రహించాలన్నారు. కంటోనె్మంట్ అనేవి స్వాతంత్య్రానికి పూర్వం ప్రత్యేకమైవుండొచ్చని, ఇప్పుడు విస్తరిస్తున్న పట్టణీకరణ నేపథ్యంలో వాటిని ప్రత్యేకంగా చూడలేమన్నారు. ఇప్పుడు అర్భన్ ల్యాండ్‌స్కేప్‌లో అవి భాగమని, ఈ వాస్తవాన్ని గ్రహించాలని రాష్టప్రతి సూచించారు.