జాతీయ వార్తలు

త్వరితగతిన విధివిధానాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 16: మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు త్వరితగతిన విధివిధానాలు రూపొందించాలని కేంద్రానికి మరోసారి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తెలుగు చలనచిత పరిశ్రమలో మాదక ద్రవ్యాల వినియోగంపై సీబీఐ చేత దర్యాప్తు జరిపించాలంటూ దర్శక, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. కేంద్రం తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ మణీందర్ సింగ్ డ్రగ్స్ నియంత్రణకు ఉద్దేశించిన విధివిధానాలు రూపొందించేందుకు నాలుగు నెలలు సమయం ఇవ్వాలని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. అయితే ఈ విజ్ఞప్తిని ధర్మాసనం తిరస్కరించింది. మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేదుకు త్వరితగతిన జాతీయ విధానం రూపొందించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. దీనిపై అన్ని రాష్ట్రాలకు నోటీసులు జారీ చేయాలని పిటిషనర్ తరపు న్యాయవాది శ్రావణ్ కుమార్ చేసిన విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది. మొదటగా కేంద్రం జాతీయ విధానం రూపొందిస్తే అనంతరం ఇతర విషయాలు చూద్దామని ధర్మాసనం స్పష్టం చేస్తూ విచారణను సెప్టెంబరు 10కి వాయిదా వేసింది.