జాతీయ వార్తలు

నిర్ణయానికి రెండు గంటలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 16: భారత ప్రధాన న్యాయమూర్తి పదవికి ఎవరినైనా నియమించడానికి ముందు చాలా కసరత్తు జరుగుతుంది. సామర్థ్యం, సీనియారిటీ వంటి అనేకాకనే అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. కానీ, ఒకప్పుడు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా సేవలు అందించిన అజిత్ నాథ్ రేకు అప్పటి సర్కారు ఎక్కువ సమయం ఇవ్వలేదు. రెండు గంటల్లోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. 1973లో చోటు చేసుకున్న సంఘటన విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి వైవీ చంద్రచూడ్ మనుమడు అభినవ్ చంద్రచూడ్ రాసిన ‘సుప్రీం విస్పర్స్’ పుస్తకంతో వెలుగు చూసింది. అప్పట్లోనే ఏఎన్ రే నియామకాన్ని కొంత మంది తీవ్రంగా వ్యతిరేకించగా, ఆయన మాత్రం సమర్థించుకున్నారు. అప్పటికే సీజేఐ పదవికి పోటీలో ఉన్న సీనియర్లు జైశంకర్ మణిలాల్ షెలత్, ఏఎన్ గ్రోవర్, కేఎస్ హెగ్డేలను కాదని ఏఎన్ రేను 1973 ఏప్రిల్ 25న సీజేఐగా ప్రభుత్వం నియమించింది. దీనిపై 1966-69 మధ్యకాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా పని చేసిన జగన్మోహన్ రెడ్డి, న్యాయమూర్తి సర్వ్ మిత్ర సిక్రి కేసు కూడా వేశారు. అర్హులను విస్మరించి, అనర్హులను పీఠం ఎక్కించారని ఆరోపించారు. సంచలనం సృష్టించిన నాటి సంఘటనపై ఏఎన్ రేసహా సుమారు 66 మంది సుప్రీ కోర్టు న్యాయమూర్తులు అమెరికాకు చెందిన విద్యావేత్త జార్జి గాడ్‌బొయిస్ జూనియర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో స్పందించారు. తాను ముమ్మాటికీ సీజేఐ పదవికి అర్హుడినని ఏఎన్ రే స్పష్టం చేశారు. తనను విమర్శిస్తున్న వారిలో చాలా మందికి కనీసం పదో తరగతి పాసయ్యేటంట జ్ఞానం కూడా లేదని వ్యాఖ్యానించారు. అయితే, ఇంటర్వ్యూలు ఇచ్చిన చాలా మంది న్యాయమూర్తులు సీజేఐగా ఏఎన్ రే నియామకాన్ని తప్పుపట్టారు. న్యాయ వ్యవస్థలో ప్రభుత్వ జోక్యం విపరీత పరిణామాలకు తావిస్తుందని హెచ్చరించారు.
2010లో ఏఎన్ రే మృతి చెందగా, సుమారు ఎనిమిదేళ్ల తర్వాత అభినవ్ ‘సుప్రీం విస్పర్స్’ పేరుతో పుస్తకాన్ని రాయడం, అందులో సీజేఐ నియామకంపై చెలరేగిన వివాదాన్ని ప్రస్తావించడం గమనార్హం.