జాతీయ వార్తలు

అది కాంగ్రెస్‌కు అలవాటే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: తాను మద్దతు ఇస్తున్న సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏడిపించడం, కూలగొట్టడం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని, ఇప్పుడు కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామిని కూడా ఆ పార్టీ తన చర్యలతో ముప్పుతిప్పలు పెడుతోందని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ విమర్శించారు. గతంలో కాంగ్రెస్ సహకారంతో అదికారం చేపట్టిన చరణ్‌సింగ్, చంద్రశేఖర్, హెడి దేవెగౌడ, ఐకె గుజ్రాల్‌లను కూడా కాంగ్రెస్ ఇలాగే చేసిందని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన ఫేస్‌బుక్‌లో పోస్టు చేస్తూ కేవలం మోదీని గద్దెదించాలనే ఏకైక లక్ష్యంతోనే ఏవిధమైన దశ-దిశ లేకుండా వివిధ పార్టీలతో పొత్తుపెట్టుకోవాలని కాంగ్రెస్ భావిస్తోందని ఆయన మండిపడ్డారు. ఈ దేశం నిస్సహాయుడైన ప్రధానిని కోరుకోవడం లేదని వ్యాఖ్యానించారు. ఇటీవల కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కన్నీరు పెట్టుకోవడం చూశామని, ఇది కాంగ్రెస్‌తో పొత్తువల్ల అతను పడుతున్న బాధను స్పష్టంగా తెలియజేస్తోందని ఆయన చెప్పారు. తాను ముఖ్యమంత్రిగా సంతోషంగా లేనని, గొంతులో గరళం ఉంచుకున్న శివునిలా తన పరిస్థితి ఉందని ఇటీవల కుమారస్వామి చేసిన వ్యాఖ్యలను జైట్లీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. కుమారస్వామి వ్యాఖ్యలు వింటే తనకు పాత ట్రేజడీ హిందీ సినిమాలోని డైలాగులు గుర్తుకు వస్తున్నాయని అన్నారు.
రెండు పార్టీల పొత్తు పరిణామం ఇలా వుందని ఆయన చెప్పారు. ఏ విధమైన లక్ష్యం లేకుండా పొత్తులు ఏర్పాటు చేసుకునే పార్టీలు కేవలం తమ స్వార్థ ప్రయోజనాలను మాత్రమే ఆశిస్తాయని అన్నారు. వారు కేవలం తమ ఉనికి కోసమే పాటుపడతారు తప్ప దేశ ప్రయోజనాల కోసం కాదని జైట్లీ పేర్కొన్నారు. తమ కుటుంబానికి చెందిన వ్యక్తులు మాత్రమే దేశాన్ని పాలించాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంటోందని, ఒకవేళ ఇతర పార్టీలకు చెందిన వారెవరైనా ఉన్నత పదవిని అధిష్టిస్తే వారిని దాని నుంచి కూలదోసేవరకు కాంగ్రెస్ నిద్రపోదని ఆయన విమర్శించారు.