జాతీయ వార్తలు

హక్కుల సాధనకు పారాడతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 17: తెలంగాణ హక్కుల సాధనకు పార్లమెంట్‌లో పోరాటం కొనసాగుతుందని టీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నాయకుడు జితేందర్‌రెడ్డి వెల్లడించారు. మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశానికి టీఆర్‌ఎస్ తరపున జితేందర్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేలా చూడాలని అన్ని పార్టీలను కోరినట్టు చెప్పారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ, ఐటీఐఆర్, ఐఐఎం వంటి విద్యా సంస్థల ఏర్పాటు, విభజన హామీలపై పార్లమెంట్‌లో చర్చ జరగాలని ఆయన అన్నారు. తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల సమస్యలు చాలా ఉన్నాయని, వాటిపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. లోక్‌సభలో తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని ఆ పార్టీ ఎంపీలు కోరారని, దీనిపై తమ అధినేత చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకుంటారని వారికి వివరించినట్టు చెప్పారు. విభజన హామీలపై తమ పార్టీ మద్దతు ఇస్తుందని టీడీపీ ఎంపీలకు తెలిపినట్టు వివరించారు.
హోదాకోసం పోరాటం ఆగదు
న్యూఢిల్లీ, జూలై 17: ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరిగే వరకు పార్లమెంట్ ఉభయ సభల్లో పోరాటం కొనసాగిస్తామని, లోక్‌సభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి తీరతామని తెలుగుదేశం పార్టీ ఎంపీలు స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశానికి తెలుగుదేశం నుంచి ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు సుజనా చౌదరి, ఎంపీలు తోట నర్సింహ, సీఎం రమేష్ పాల్గొన్నారు. అనంతరం సుజనా చౌదరి విలేఖరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరగకుండా సభా కార్యక్రమాలు సజావుగా సాగేందుకు తాము సహకరించేది లేదని అన్ని పార్టీలకు వివరించినట్టు చెప్పారు. పార్లమెంట్ ఉభయ సభల్లోనూ తమ నిరసన కొనసాగుతుందని, లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తామని చెప్పారు. బీజేపీ, కాంగ్రెసేతర పార్టీల సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కుల సాధనకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. సీఎం రమేష్ మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అఖిలపక్ష సమావేశంలో ప్రత్యేక హోదా ఇస్తే బాగుంటుందని మాత్రేమే కోరారని, కచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేయలేదని అన్నారు.