జాతీయ వార్తలు

సజావుగా సాగేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 17: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు పట్టిన గతే వర్షాకాల సమావేశాలకూ పడుతుందా? ప్రతిపక్షం గొడవకు దిగితే ఈ సమావేశాలు కూడా తుడిచిపెట్టుకుపోవడం ఖాయం. తెలుగుదేశం పార్టీ ఈ సమావేశాల్లోనూ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించేందుకు సిద్ధమవుతోంది. ఈ వర్షాకాల సమావేశాలు వాడివేడిగా జరుగనున్నాయి. జూలై 18 నుండి ఆగస్టు 10 వరకు జరిగే సమావేశాల్లో ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని ఉతికి ఆరేయాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి. విభజన హామీలను అమలు చేయాలంటూ తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఎన్‌డీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించారు. లోక్‌సభలో తెలుగుదేశం పక్షం నాయకుడు తోట నరసింహం, లోక్‌సభ సభ్యుడు కేశినేని నాని అవిశ్వాస తీర్మానం నోటీసును స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు అందజేశారు. లోక్‌సభ బుధవారం ఉదయం పదకొండు గంటలకు సమావేశం కాగానే తెలుగుదేశం ఎంపీలు తమ అవిశ్వాస తీర్మానాన్ని చేపట్టాలంటూ గొడవ చేయనున్నారు. దీనికి ప్రతిపక్షం మద్దతు లభించే సూచనలు కనిపించటం లేదు. పార్లమెంటు ఉభయ సభలను స్తంభించపజేయటం వలన రాజకీయంగా తమకే నష్టం కలుగుతోందని కాంగ్రెస్ తదితర ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నాయి. గొడవ చేసే బదులు వివిధ అంశాలపై చర్చ జరిపి లోపాలు, లొసుగులను ప్రజల ముందు పెట్టటం ద్వారా బీజేపీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని ఉతికి పారేయాలని కాంగ్రెస్ తదితర ప్రతిపక్షాలు ఆలోచిస్తున్నాయి. 2019లో జరిగే లోక్‌సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ సమావేశాలకు ఎంతో రాజకీయ ప్రాధాన్యత ఉన్నది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం తప్పులను బయట పట్టటం ద్వారా రాజకీయ ప్రయోజనాలను సాధించుకోవాలని ప్రతిపక్షం పట్టుదలతో ఉన్నది. ఎన్‌డీఏ ప్రభుత్వంపై ఎదురుదాడి చేసేందుకు కాంగ్రెస్ నాయకత్వంలో 13 పార్టీలు సిద్ధమవుతున్నాయి. కాంగ్రెస్, ఎన్‌సీపీ, టీఎంసీ, బీఎస్‌పీ, ఎస్‌పీ, ఆర్‌జేడీ, డీఎంకే, వామపక్షాలు తదితర పార్టీలు ఈసారి కలిసికట్టుగా కేంద్ర ప్రభుత్వంపై దాడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. అల్లరి మూకల దాడి (మాబ్ లించింగ్), దళితులు, మహిళలపై జరుగుతున్న దాడులు, పెరుగుతున్న నిరుద్యోగం, రైతులు పడుతున్న బాధలు, వెనుకబడిన కులాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఉన్నత విద్యారంగంలో రిజర్వేషన్ల వివాదం తదితర అంశాలను ప్రతిపక్షాలు ప్రస్తావించనున్నాయి. బీజేపీ ప్రజాప్రతినిధులు ఇటీవల చేసిన వివాదాస్పద ప్రకటనల గురించి కూడా ప్రతిపక్షం ప్రస్తావించనున్నది. మహిళా రిజర్వేషన్ల బిల్లును కాంగ్రెస్ ప్రత్యేకంగా ప్రస్తావించనున్నది. ఇదిలాఉంటే అధికార పక్షం త్రిపుల్ తలాక్, జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించటం తదితర అంశాలను ఈ సమావేశాల్లో పూర్తి చేయాలనుకుంటోంది. సమావేశాలు సజావుగా కొనసాగేందుకు సహకరించాలంటూ పలువురు కేంద్ర మంత్రులు, స్వయంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి విజయ్ గోయల్, ప్రతిపక్ష నాయకులను కలిసి విజ్ఞప్తి చేశారు. వర్షాకాల సమావేశాల్లో ఆరు ఆర్డినెన్సులకు చట్టరూపం ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత కుమార్ తెలిపారు. పార్లమెంటు ఉభయ సభల ముందు మొత్తం 39 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. 123 రాజ్యాంగ సవరణ బిల్లు, త్రిపుల్ తలాక్ బిల్లు, ట్రాన్స్‌జెండర్ భత్రద బిల్లు, జాతీయ వైద్య కమిషన్ బిల్లు, బాలబాలికల విద్యా హక్కు బిల్లులు ఉభయ సభల్లో చర్చకు పెట్టి ఆమోదం తీసుకునేందుకు ప్రయత్నిస్తామని అనంత కుమార్ తెలిపారు.